Breaking News

బతుకమ్మ స్పెషల్‌ : సద్దుల బతుకమ్మకు నైవేద్యాల తయారీ

Published on Sat, 09/27/2025 - 13:12

సద్దుల బతుకమ్మ రోజున అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే వంటకాలు  ప్రాంతాల వారీగా ఉంటాయి. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, పుట్నాలు, బియ్యం.. తో వంటలు చేస్తారు.   టిప్‌ ఆఫ్‌ ది డేలో భాగంగా సద్దుల బతుకమ్మ నైవేద్యాల తయారీ గురించి తెలుసుకుందాం. 

 పొడులతో సద్దు
కావల్సినవి : ∙అన్నం – 3 కప్పులు నువ్వులు, వేరుశనగలు, ఎండు కొబ్బరి (వేయించి, ΄÷డులు అర కప్పు చొప్పున) –  పొడులకు, కారం, ఉప్పు కలుపుకోవచ్చు.

తయారీ : ఒక్కో కప్పు అన్నానికి ఒక్కో అరకప్పు రకం పొడి కలిపి సద్దులను సిద్ధం చేసుకోవాలి. అవసరమైతే శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసిన పోపును కలుపుకోవచ్చు. 

సజ్జ ముద్దలు / సజ్జ లడ్డూలు
కావల్సినవి: సజ్జల పిండి – 2 కప్పులు; బెల్లం – కప్పు  (తురిమినది); సోంపు – 2 టీ స్పూన్లు; నెయ్యి – 2 టీ స్పూన్లు 
తయారి: సజ్జ పిండిలో తగినన్ని నీళ్లు కలిపి, ముద్ద చేయాలి. తగినంత ముద్ద తీసుకొని, చపాతీ చేసినట్టుగా రొట్టె చేసి, పెనం మీద వేసి కాల్చాలి. మరీ గట్టిగా కాకుండా రెండువైపులా కాల్చి, ప్లేట్‌లో వేయాలి. వేడిగా ఉండగానే చేత్తో రొట్టెను చిన్న చిన్న ముక్కలు చేసి, (చేత్తో చేయలేని వారు రోట్లో రొట్టె, బెల్లం వేసి దంచవచ్చు) బెల్లం, సోంపు, నెయ్యి వేసి, గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి. ఇలా తయారుచేసిన సజ్జ ముద్దలను అమ్మవారికి న్రైవేద్యంగా పెడతారు. 

వీటిలో ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది. అందుకని చిన్నపిల్లలు, గర్భవతులకు తప్పక పెడతారు. 3–4 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో సజ్జ రొట్టెకు బదులుగా గోధుమ రొట్టెతో ముద్దలు కడతారు.

పెరుగన్నం
కావల్సినవి:  కప్పు అన్నం, కప్పు పెరుగు, తగినంత ఉప్పు
తయారి: అన్నంలో పెరుగు, ఉప్పు వేసి కలపాలి. చివరగా బాణలిలో కొద్దిగా నెయ్యి/నూనె వేసి పోపు పెట్టుకోవాలి. అదనంగా జీడిపప్పు 
చేర్చుకోవచ్చు.

పరమాన్నం
కావల్సినవి: కప్పు – బియ్యం; మూడు – కప్పుల పాలు; కప్పు– నీళ్లు; కప్పు – బెల్లం; మూడు టీ స్పూన్లు – నెయ్యి;
తయారి: అన్నం ఉడుకుతుండగా దాంట్లో తరిగిన బెల్లం, నెయ్యి వేసి, పాలు  పోసి, మరికాసేపు ఉడికించి దించాలి. నెయ్యిలో వేయించిన  జీడిపప్పు, కిస్‌మిస్‌ పరమాన్నంలో కలపాలి.  
 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)