Breaking News

BAPS అబుదాబి హిందూ మందిర్‌ : కఠిన నిబంధనలు, డ్రెస్‌ కోడ్‌

Published on Sat, 03/02/2024 - 17:52

అబుదాబిలో ఇటీవల (ఫిబ్రవరి 14, 204) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ మందిరంలో డ్రెస్‌కోడ్‌ వార్తల్లో నిలిచింది. మార్చి  ఒకటో తేదీనుంచి ఇక్కడ ప్రజల దర్శనాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో నియమ నిబంధనలు, భక్తుల డ్రెస్‌ కోడ్‌కు సంబంధించిన నియమాలు, మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా క్యాప్స్‌, టీషర్ట్‌లు, అభ్యంతరకరమైన దుస్తులకు  అనుమతి ఉండదు.

డ్రెస్‌ కోడ్‌, ఇతర నిబంధనలు
అబుదాబి మందిర్ ట్విటర్‌లో షేర్‌ చేసిన  వివరాల ప్రకారం  ప్రతి మంగళవారం - శనివారం,  ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు  భక్తుల సందర్శనార్థం ఈ మందిర్‌ తెరిచి ఉంటుంది. సోమవారం మాత్రం  ఆలయాన్ని   మూసివేస్తారు.

ముస్లిం దేశంలో అబుదాబిలో తొలి  హిందూ దేవాలయంబాప్స్‌లో డ్రెస్ కోడ్, మార్గదర్శకాల విషయంలో  కఠినంగా వహరించనున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం, మెడ, మోచేతులు, మడమల వరకూ కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. టైట్‌గా ఉన్న దుస్తులు, స్లీవ్‌లెస్‌, షార్ట్స్‌కు అనుమతించరు. శబ్దాలు చేసే ఉపకరణాలనూ ఆలయంలోకి అనుమతించరు. బయటి ఆహారాన్ని ఆలయంలోకి తీసుకు రాకూడదు.  పెంపుడు జంతువులకు కూడా ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. అంతేకాదు దేవాలయం పరిసరాల్లో డ్రోన్స్‌ వినియోగంపై కూడా నిషేధం విధించారు.

ఫోటోలకు అనుమతి ఉందా?
వ్యక్తిగత అవసరాల కోసమే ఫోటోలు తీసుకోవచ్చు. ఎవరైనా వాణిజ్య అవసరాల నిమిత్తం వీడియోను రికార్డ్ చేయాలనుకుంటే, వారు తప్పనిసరిగా అధికారుల  అనుమతి  తీసుకోవాలి. ఆలయంలోని ఆధ్యాత్మిక, ప్రశాంత వాతావరణానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా భక్తులు నియమాలను పాటించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు.

కాగా 700 కోట్ల  రూపాయల వ్యయంతో 27 ఎకరాల్లో  బాప్స్ సంస్థ ఆధ్వర్యంలో అబూ మారేఖ్ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగింది. శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయంలో ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?