Breaking News

ఆ ఆర్మీ ఆఫీసర్‌ నిర్మించిన ‘బేలీ' ఆ మహిళలకు అండగా మారింది..!

Published on Fri, 08/01/2025 - 10:52

గత సంవత్సరం కేరళలోని వయనాడ్‌లో వచ్చిన భారీ వర్షాలు, విరిగి పడిన కొండచరియలు ఎంతోమంది జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. ఈ నేపథ్యంలో వరదబాధితులకు వేగంగా సహాయం అందించడానికి ఆర్మీ ఆఫీసర్‌ సీతా షెల్కే 144 మంది ఆర్మీ జవానుల బృందంతో కలిసి ‘బేలీ వంతెన’ నిర్మించింది. 

ఆనాటి వరదల్లో సర్వస్వం కోల్పోయిన మహిళలకు ఇప్పుడు ‘బేలీ’ అండగా నిలబడింది. అయితే ఇది వంతెన కాదు. వరద బాధిత మహిళలు తమ జీవితాలను పునర్మించుకోవడానికి వచ్చిన ప్రాజెక్ట్‌. ‘బేలీ అంబరిల్లా అండ్‌ బ్యాగ్స్‌ ప్రాజెక్ట్‌’ ద్వారా ఎంతోమంది మహిళల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది.

జిల్లా అధికార యంత్రాంగం స్వయం సహాయక బృందం ‘కుటుంబశ్రీ’ భాగస్వామ్యంతో ‘బేలీ అంబరిల్లా అండ్‌ బ్యాగ్స్‌ ప్రాజెక్ట్‌’ను ప్రారంభించింది. ఆనాటి వరదల్లో ‘బేలీ వంతెన’ ఎంతోమంది బాధితులను కాపాడింది. ఆ కృతజ్ఞతతోనే ఈ జీవనోపాధి ప్రాజెక్ట్‌కు ‘బేలీ’ అని నామకరణం చేశారు. ‘బేలీ ప్రాజెక్ట్‌’లోని మహిళలు తయారు చేస్తున్న రంగురంగుల గొడుగులు, బ్యాగులను కుటుంబశ్రీ స్టాల్స్, ట్రైబల్‌ డిపార్ట్‌మెంట్‌ ఔట్‌లెట్స్‌లో ప్రదర్శిస్తున్నారు.

‘బేలీ బ్రాండ్‌’ బ్యాగులు, గొడుగులకు తక్కువ కాలంలోనే మంచి పేరు వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి వీటికి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ‘బేలీ ప్రాజెక్ట్‌’కు సంబంధించిన పని ప్రదేశం... కేవలం బ్యాగులు, గొడుగుల తయారీ కేంద్రం మాత్రమే కాదు. ‘విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడవచ్చు. మోడువారిన పరిస్థితులలోనూ కొత్తగా పునర్జీవించవచ్చు’ అని బలంగా చెప్పే ప్రదేశం. 

(చదవండి: ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!)

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)