Breaking News

అడవులన్నీ పైలంగా.. ఆపదలన్నీ దూరంగా..

Published on Mon, 09/15/2025 - 18:00

‘అడవి పూల సింగారం.. చేను చెల్కల బంగారం 
పైలమే తల్లీ.. పైలమే బతుకమ్మా.. 
గునుగు పూలెయ్యాలో.. తంగెడు పూలెయ్యాలో.. 
ఊరూ.. అడవి.. ఆడీపాడంగా.. 
అడవులన్నీ పైలంగా.. ఆపదలన్నీ దూరంగా..  
చప్పట్లే మిరిమిట్లవ్వంగా.. రావే చెల్లి.. రావే అక్క.. 
బతుకమ్మ ఆడగరావే.. ఉయ్యాలో.. ఉయ్యాలో.. 
బతుకు సుడిగుండం దాటి బరిగీసి నిలువగ రావే.. ఉయ్యాలో.. ఉయ్యాలా..’

ఇలా సాగే బతుకమ్మ పాటతో బహుజన బతుకమ్మ సింగారించుకుంది. ఈ పాటను వేములవాడకు చెందిన కూర దేవేందర్‌ అలియాస్‌ అమర్‌ అలియాస్‌ మిత్ర రాయగా.. ఆయన సతీమణి విమలక్క గానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిసరాల్లోనే చిత్రీకరణ జరిగింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఆదివారం బహుజన బతుకమ్మ పాటను ఆవిష్కరించారు. పన్నెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బతుకమ్మ (Bahujana Bathukamma) ఆటాపాటలతో అలరించనుంది.

ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అని చాటుదాం 
‘బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం అంటూ..’ ప్రారంభమైన ఈ కార్యక్రమానికి 15 ఏళ్లు నిండుతున్నాయి. తెలంగాణ ప్రాంత మెట్టపంటలు అందివచ్చే కాలానికి పంటల పండుగలా (హార్వెస్ట్‌ ఫెస్టివల్‌) వస్తున్న బతుకమ్మను తెలంగాణ ప్రజలు వందల ఏళ్లుగా జరుపుకుంటున్నారు. ఈ సాంస్కృతిక ఉత్సవం మహత్తర తెలంగాణ (Telangana) సాయుధ పోరాటకాలంలోనూ, రైతాంగ పోరాటాలలోనూ, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో సాధనంగా మారిన అనుభవం ఉంది. 

పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో మొదలైన బహుజన బతుకమ్మ, కులం, మతం అని తేడాలు లేకుండా, వనరుల విధ్వంసం జరగకుండా, ప్రత్యేకించి స్త్రీల సమానహక్కుల ప్రస్తావనతో సెక్యులర్‌ పండుగగా జరగాలని బహుజన బతుకమ్మ కృషి చేస్తుంది. ‘ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ’అనే నినాదంతో ఈ ఏడాది బహుజన బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.  

సిరిసిల్ల ప్రాంతంలో చిత్రీకరణ 
బహుజన బతుకమ్మ పాటను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, గోపాల్‌రావుపల్లి, తాడూరు శివారుల్లో చిత్రీకరించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క బృందం, జానపద కళాకారుడు వంతడ్పుల నాగరాజు పర్యవేక్షణలో ఈ పాట షూటింగ్‌ జరిగింది. ‘ప్రకృతి విధ్వంసమంటే.. ప్రజలపై యుద్ధమే.. శాంతి స్వావలంబన చాటుదామని ఈ ఏడాది ప్రజాబాహుళ్యంలోకి వెళ్లారు. గత 15 ఏళ్లుగా బహుజన బతుకమ్మను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిర్వహిస్తోంది. కళాకారుల నృత్యాలు, ఆటపాటలతో గోపాల్‌రావుపల్లి, తాడూరు, తంగళ్లపల్లి పరిసరాల్లో సందడి చేశారు.

పన్నెండు రోజులు పాటల పండుగే 
బహుజన బతుకమ్మ పాటల పండుగను రాష్ట్రమంతంటా నిర్వహించనున్నారు. తొలిరోజు సెప్టెంబ‌ర్‌ 20న గన్‌పార్క్‌లో 11 గంటలకు నివాళితో మొదలై.. 3 గంటలకు ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో ఆటపాటలతో ప్రారంభమవుతుంది. 

సెప్టెంబర్‌ 21న సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి, 22న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు, 23న వనపర్తి జిల్లా కొత్తకోట, 24న ఉమ్మడి నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రం, 25న ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు, 26న ఉమ్మడి వరంగల్‌ జిల్లా భూపాలపల్లి మండలం పెద్దాపురంలో, 27న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వేడుకలు నిర్వహించనున్నారు. 

చ‌ద‌వండి: గ‌త చ‌రిత్ర‌కు స‌జీవ సాక్ష్యం.. అమ్మాపురం సంస్థానం

సెప్టెంబర్‌ 28న ఉమ్మడి మెదక్‌ జిల్లా పెద్ద నిజాంపేట మండలం కల్వకుంట, 29న హైదరాబాద్‌లోని మల్లాపురం గోకుల్‌నగర్‌లో, 30న మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం వెన్నాచెడ్, అక్టోబర్‌ 3న నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండల కేంద్రంలో బహుజన బతుకమ్మ వేడుకలు ముగియనున్నాయి.
- సిరిసిల్ల

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)