Breaking News

ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!

Published on Sun, 06/01/2025 - 11:17

మయాన్మార్‌లోని బాగన్‌ ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం. ఒకప్పుడు పేగన్‌ సామ్రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన ఈ ప్రాంతం, వేలాది పురాతన బౌద్ధ దేవాలయాలు, స్థూపాలు, పగోడాలకు ప్రసిద్ధి చెందింది. 11 నుంచి 13 శతాబ్దాల మధ్య నిర్మించబడిన ఈ నిర్మాణాలు బర్మీస్‌ నిర్మాణ కళకు అద్భుతమైన సాక్ష్యాలుగా కనిపిస్తాయి.

విస్తారమైన మైదానంలో ఎటు చూసినా కనిపించే ఈ ఆలయాల దృశ్యం గొప్ప అనుభూతినిస్తుంది. సంధ్యవేళలో బంగారుకాంతితో మెరిసే ఈ నిర్మాణాలు, సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆనంద టెంపుల్, శ్వేదగాన్‌ పగోడా, థాబ్యిన్యు టెంపుల్‌ వంటి ముఖ్యమైన ఆలయాలు అక్కడి చరిత్రను చాటి చెబుతాయి.

బాగన్‌ అందాలను ఆస్వాదించడానికి ‘హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ రైడ్‌’ భలేగా ఉంటుంది. ఆ రైడ్‌తో ఆకాశంలో గిరికీలు కొడుతూ ఎత్తయిన ప్రదేశం నుంచి ఈ పురాతన నగరంలోని విశాలమైన ఆలయాల దృశ్యాన్ని చూడటం ఒక మరపురాని అనుభవం కలిగిస్తుందంటారు పర్యాటకులు. 

కాలక్రమేణా ఇక్కడ కొన్ని ఆలయాలు శిథిలమైనప్పటికీ, బాగన్‌ చారిత్రక ప్రాముఖ్యతతో పాటు ఆధ్యాత్మిక వైభవం మాత్రం చెక్కుచెదరలేదు. ఇది చరిత్ర, సంస్కృతిని ప్రేమించే వారు, తప్పక చూడవలసిన ప్రదేశం. 

(చదవండి: Krishna's Butterball: కృష్ణుడి వెన్నబంతి: సైన్స్‌కే అందని మిస్టరీ..!)

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)