Breaking News

ఆద్యకళను అడ్డుకోవడమా?

Published on Sat, 05/31/2025 - 14:18

‘ఆద్యకళ’ పేరిట ప్రొ‘‘ జయధీర్‌ తిరుమలరావు గత కొన్నేళ్లుగా వివిధకేంద్రాలలో ఏర్పాటు చేస్తున్న పురావస్తు ప్రదర్శనలు విశేష ఆదరణ పొందు తున్నాయి. జానపద పరిశోధకుడిగా ఆయన దశాబ్దాలుగా సేకరిస్తూ, ప్రద ర్శిస్తున్న వేలాది ఆదివాసీ కళాఖండాలు, పనిముట్లు, సంగీత వాద్యాలు, లోహ ప్రతిమలు, సాంస్కృతిక చిహ్నాలు వెలకట్టలేనివి. అయితే వీటిసంరక్షణ తన శక్తికి మించిన పని అవుతోందనీ, వాటి కోసం ఒక ప్రత్యేక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలనీ తిరుమలరావు ఎంతో కాలంగాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వాటిలో కొన్నింటి భద్రత, ప్రదర్శన నిమిత్తం హైదరాబాద్, నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆవరణలో కొంత స్థలాన్ని కేటాయించింది. అదేవిధంగా ఉస్మా నియా యూనివర్సిటీ ఆవరణలో ఉన్న అధ్యాప కుల నివాస స్థలాల్లో రెండు గృహాలను ఈ పురా వస్తు సంరక్షణ, ప్రదర్శన, భద్రత కోసం అధికారికంగా అప్పగించారు. 

అయితే ఆ నివాసాలు శిథిలావస్థలో ఉన్నందున వాటికి ప్రభుత్వం మరమ్మతు పనులు చేయిస్తుండగా విద్యార్థి సంఘాలకు చెందినవారు ‘ప్రయివేటు వ్యక్తులకు ప్రొఫెసర్‌ క్వార్టర్లు కేటాయించడం కుదరదు. తక్కువ రెంటుతో లబ్ధి పొందుతున్నారు’ అని అభ్యంతరం చెబుతూ  నిర్మాణ సామగ్రిని కూలదోసి, చిందరవందర చేశా’రని తిరుమలరావు ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆయన ఇదే విశ్వవిద్యాలయంలో చాలా కాలం పని చేసినవారే. ఆదివాసీ సంస్కృతిని కాపాడేందుకు ఎవరితోనైనా చేతులు కలిపి పని చేసేందుకు తాను సిద్ధమే అనేది ఆయన ప్రతిపాదన. 

రెండేళ్ల క్రితం పురాతత్త్వ ప్రదర్శనశాల వారి ఆహ్వానంపై తిరుమల రావు ప్యారిస్‌ వెళ్లారు. అప్పుడు జర్మనీ, స్విట్జర్లాండ్‌ లాంటి దేశాల ప్రతి నిధులు వాటిలో కొన్నింటిని తమ మ్యూజియాలలో భద్రపరుస్తామని ముందుకు వచ్చారు. అయితే ఇది భారతదేశ సంపద అని వారి ప్రతిపాదనను ఆయన ఒప్పుకోలేదు. గత ఏడాది ఢిల్లీలోని రాష్ట్రపతి నివాసంలో నిర్వహించిన గిరిజన సాంస్కృతిక ప్రదర్శనలో వీటికి గౌరవం దక్కింది. ఇక్కడ చూస్తే పరిస్థితి ఇలా ఉంది! కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు అందరూ చాలా కాలంగా తిరుమలరావుకు బాసటగా నిలబడి, ఆద్యకళ మ్యూజియం ఏర్పాటుకై ప్రభుత్వాలకు ఎన్నో వినతులను సమ ర్పించారు. చివరకు ప్రదర్శనశాల ఒక కొలిక్కి వస్తున్న దశలో అశని పాతంలా వచ్చి పడిన ఈ విద్యార్థి సంఘాల వారి బెదిరింపు ఖండనార్హం. 
– బద్రి నర్సన్‌
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)