Breaking News

Parenting Tips : సెక్షన్‌ పరేషాన్‌, సిలబస్‌ టెన్షన్‌

Published on Fri, 06/20/2025 - 14:56

పిల్లలకు కొత్త యూనిఫామ్, బ్యాగు, పుస్తకాలు కొనిస్తే చాలనుకుంటారు తల్లిదండ్రులు. పాత క్లాస్‌ నుంచి కొత్త క్లాస్‌కు వచ్చాం. రోజూ స్కూలుకు వెళ్లి కూచోవడమేగా అనుకుంటారు పిల్లలు. కాని ఎనిమిది, తొమ్మిది, పది తరగతులకు వచ్చిన పిల్లలను బడికి సిద్ధం చేయాలి. గత సంవత్సరం వారి చదువులోని మంచి చెడ్డలను బేరీజు వేసి ఈ క్లాసులో మరింత మెరుగ్గా ఎలా చదవాలో అవగాహన కలిగించాలి. స్కూల్లో, ఇంట్లో వారిని మార్చాలి... తల్లిదండ్రులు మారాలి...ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

పిల్లలు స్కూల్‌కు వెళ్లడం అంటే మరో తరగతిని చదవడమే అని భావిస్తారు. స్కూల్‌ రీఓపెన్‌ అయ్యాక  పాత తరగతిని ఒదిలి పై తరగతికి వెళ్లడం వీరికి ఉత్సాహంగా ఉంటుంది. మనం కొంచెం ఎదిగాం అనుకుంటారు. గత సంవత్సరం చదివినట్టుగానే ఈ సంవత్సరం చదివేయాలి అని భావిస్తారు. ఇవన్నీ ప్రతి విద్యార్థికీ రొటీన్‌గా అనిపించవచ్చుగాని తరచి చూస్తే తల్లిదండ్రుల ప్రమేయంతో పిల్లలకు సహాయపడాల్సిన అంశాలు చాలా ఉంటాయి.

1. సెక్షన్‌ పరేషాన్‌
చాలా స్కూళ్లలో కొత్త విద్యా సంవత్సరానికి స్టూడెంట్స్‌ను షఫుల్‌ చేయడం ఉంటుంది. అంటే గత సంవత్సరం చదివిన సెక్షన్‌ కాకుండా కొత్త సెక్షన్‌ వేస్తారు. గత క్లాసులోని ఫ్రెండ్స్‌ ఈ క్లాసులో ఉండొచ్చు... ఉండక పోవచ్చు. దాంతో కొందరు పిల్లలు అప్‌సెట్‌ అవుతారు. ఫ్రెండ్స్‌ ఉన్న సెక్షన్‌లోకి వెళతామంటారు. ఇందుకు స్కూల్‌ వారు ఒప్పుకోరు. కొత్త సెక్షన్‌లో వేయడం వల్ల మొదట కష్టంగా ఉన్నా తర్వాత తర్వాత బాగుంటుందనీ, కొత్త ఫ్రెండ్స్‌ అవుతారని, ఈ మార్పుకు అలవాటు పడటం ముందు ముందు మంచి చేస్తుందని పిల్లలకు తల్లిదండ్రులు నచ్చజెప్పాలి. తేలిగ్గా వదిలేయకుండా అలవాటు పడేవరకు రోజు క్లాసు విశేషాలు మాట్లాడుతూ, ‘అరె... ఈ సెక్షనే బాగుందే’ అని ఉత్సాహపరుస్తూ పాత బెంగను మరువనివ్వాలి. కొత్త క్లాసు టీచర్లను కలిసి, సంగతి చెప్పి, పిల్లాడిని వాళ్లు దగ్గర తీసేలా చేయాలి. ఇక తర్వాత చదువు అదే కొనసాగుతుంది.

2. సిలబస్‌ చదివారా?
పిల్లలకు ఏడు వరకు చదువు ఒక విధంగా ఎనిమిది నుంచి మరో విధంగా సాగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు కొత్త పుస్తకాలు కొనిస్తారుగాని  తెరిచి చూడరు. తల్లిదండ్రులు తప్పనిసరిగా 8, 9, 10... ఏ క్లాసైతే ఆ క్లాస్‌ టెక్స్‌›్ట బుక్స్‌ అన్నీ  తిరగేయాలి. ఎంత సిలబస్‌ ఉంది... చాప్టర్‌లు ఏమిటి పరిశీలించాలి. గత సంవత్సరం వచ్చిన మార్కులను బట్టి, విద్యార్థితో చర్చించాలి. ఉదాహరణకు విద్యార్థి ఇంగ్లిష్‌లో తప్ప మిగిలిన సబ్జెక్ట్స్‌లో బాగుంటే  ఈ సంవత్సరం ఆ సబ్జెక్ట్‌ సులువుగా ఎలా చదువుకోవచ్చో విద్యార్థికి అవగాహన కలిగించాలి. లేకుంటే విద్యార్థి తనకు ఇంగ్లిష్‌ ఇబ్బందిగా ఉందని ఈ సంవత్సరం కూడా చెప్పడు. ఫైనల్‌ ఎగ్జామ్స్‌ వేళకు ఇది సమస్యై కూచుంటుంది. అందుకే ఇంగ్లిష్‌ను దాటడం ఈ సంవత్సరపు మొదటి గోల్‌ అని చె΄్పాలి.

3. దినచర్య/నిద్ర ఖరారు
పిల్లలు ఎంత గారాల పట్టీలైనా వారికి ఒక దినచర్యను ఖరారు చేయడం క్రమశిక్షణను ఇస్తుంది. క్రమశిక్షణ లేకపోతే ఏ పనీ జరగదు. అందువల్ల స్కూల్‌కు వెళ్లడం దగ్గరి నుంచి రాత్రి నిద్ర΄ోవడం వరకూ తల్లిదండ్రులు, విద్యార్థి కూచుని విద్యార్థి అంగీకారంతో ΄్లాన్‌ చేయాలి. నిద్ర లేచే సమయం, స్కూల్‌కు ప్రిపేర్‌ అయ్యే సమయం, తిరిగి వచ్చాక రిలాక్స్‌ అవడానికి ఆటలకు సమయం, తిరిగి చదవే సమయం, హోమ్‌వర్క్‌ సమయం... ఇవన్నీ తప్పనిసరిగా నిర్ణయంచాలి. వారంలో ఏ రోజు ఏ సబ్జెక్ట్‌ను చదవాలో కూడా ΄్లాన్‌ చేయాలి. కష్టమైన సబ్జెక్ట్‌కు ఎక్కువ రోజులు కేటాయించాలి. అలాగే రోజుకు 8 గంటల నిద్ర పిల్లలకు తప్పనిసరి. నిద్రే పిల్లలకు ఆరోగ్యం. ఎనిమిది గంటల నిద్రను ఒదిలి ఇవన్నీ ΄్లాన్‌ చేయాల్సి ఉంటుంది.

4. చదివే చోటును ఏది?
కొత్త క్లాసులోకి వచ్చారు సరే... ఇంట్లో రోజూ కూచుని చదువుకునే చోటు ఏది? ఇది విద్యార్థి ఇష్టం ప్రకారం తల్లిదండ్రులు నిశ్చయించాలి. ఇంట్లోని రోజువారీ వ్యవహారాలు వారిని డిస్ట్రబ్‌ చేయని విధంగా, మంచి గాలి వెలుతురు ప్రశాంతత ఉన్న చోట పిల్లలకు స్టడీ ఏరియా డిసైడ్‌ చేయాలి. అక్కడ ఏదైనా కొత్త కుర్చీనో, స్టడీ ప్యాడ్‌నో, టేబుల్‌నో కొనివ్వగలిగితే పిల్లలకు ఉత్సాహం వస్తుంది. మంచి చదువుకునే చోటు చూపకుండా పిల్లల్ని బాగా చదవమనడం సరి కాదు.

5. ధ్యాస మళ్లించే విషయాలు ఏవి?
కొత్త విద్యా సంవత్సరంలో గత సంవత్సరం టైమ్‌ వేస్ట్‌ చేయించిన విషయాలు ఏమిటో తల్లిదండ్రులు, విద్యార్థి కూచుని మాట్లాడుకోవాలి. టీవీ, ఫోన్, కంప్యూటర్, గేమ్స్, సినిమాలు... ఇవి స్టూడెంట్‌ను డిస్ట్రాక్ట్‌ చేస్తే పెళ్లిళ్లు పేరంటాలని చెప్పి స్కూలుకు డుమ్మాలు కొట్టించడం, ఎక్కువ ప్రయాణాలు... ఇవి పెద్దల వల్ల వచ్చే అంతరాయాలు. ఇద్దరూ కంట్రోల్‌ చేసుకోవాల్సిందే. గత సంవత్సరం అటెండెన్స్‌ కంటే ఈ సంవత్సరం అటెండెన్స్‌ ఎక్కువ ఉండేలా కృషి చేయాలని ఇంటి సభ్యులంతా అనుకోవాలి.

ఇదీ చదవండి: నో డైటింగ్‌, ఓన్లీ జాదూ డైట్‌ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!

6. రివ్యూ మీటింగ్‌
తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రతి ఆదివారం ఉదయం విద్యార్థితో రివ్యూ మీటింగ్‌ పెట్టుకోవాలి. ఇది దండించడానికో బెదరించ డానికో కాక విద్యార్థిని అర్థం చేసుకోవడానికి అన్నట్టుగా ముందు నుంచీ తల్లిదండ్రుల ప్రవర్తన ఉండాలి. ఆ వారం జరిగిన క్లాసులు, స్లిప్‌ టెస్ట్‌లు, మార్కులు, హోమ్‌వర్కులు... అన్నీ బేరీజు వేసుకుని విద్యార్థికి ఏదైనా సమస్య ఉంటే తెలుసుకొని సరి చేయడానికి ఈ రివ్యూ మీటింగ్‌లు గట్టిగా ఉపయోగపడతాయి.

స్కూల్లో విద్యార్థి చదువుతున్నాడంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా చదువుతున్నట్టే. మా దగ్గర టైమ్‌ లేదు అంతా స్కూల్‌కే అప్పజెబుదాం అనుకుంటే విద్యార్థి గురించి ఏమీ తెలియకుండా పోతుంది. కొందరు పి.ఎం.ఐలకు కూడా వెళ్లరు. దీని వల్ల టీచర్లు ఇచ్చే సూచనలు మిస్‌ అవుతారు. కొత్త తరగతిలో మీ అబ్బాయి/అమ్మాయితో కలిసి మీరూ అడుగుపెట్టండి. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)