Breaking News

మట్టి నుంచి విద్యుత్తు!

Published on Sun, 08/17/2025 - 07:44

మట్టిలోని బాక్టీరియా అనగానే మొక్కలకు పోషణ ఇచ్చే జీవులుగా మాత్రమే అనుకోకండి. ఇప్పుడు అదే బాక్టీరియా మనకు విద్యుత్తును కూడా ఇస్తోంది! పచ్చదనానికి ఆధారంగా పనిచేసే సూక్ష్మజీవులే ఇప్పుడు పవర్‌ జనరేటర్లుగా మారిపోయాయి. ఫిలిప్పన్స్‌ ఇంజినీర్లు కేవలం మట్టిలో ఉండే బాక్టీరియాతో పనిచేసే ఒక వీథి దీపాన్ని తయారు చేశారు. 

దీనికి ఎటువంటి విద్యుత్తు తీగలు అవసరం ఉండవు. దీపం కింద ఉండే నేలలోని ప్రత్యేకమైన బాక్టీరియా జీవక్రియలో భాగంగా విడుదల చేసే ఎలక్ట్రాన్లను ‘మైక్రోబియల్‌ ఫ్యూయెల్‌ సెల్స్‌’ సాంకేతికత ద్వారా విద్యుత్తుగా మారుస్తుంది. ఆ విద్యుత్తుతో ఒక బల్బును నాలుగు నుంచి ఆరు గంటలపాటు వెలిగించేలా ఏర్పాటు చేశారు. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. 

అందుకే, ఇప్పటికీ విద్యుత్తు సదుపాయం లేని గ్రామాల్లో ఇది చాలా ఉపయోగపడే పరిష్కారంగా మారుతుంది. అయితే, ప్రస్తుతం ఈ ఆవిష్కరణ ప్రయోగ దశలోనే ఉంది. మార్కెట్‌లోకి పూర్తిగా తీసుకురావడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది నిజంగా వాడకంలోకి వస్తే, మీ ఇంటి పక్కనే ఉన్న మట్టి నుంచే గ్రీన్‌ ఎనర్జీ ఉద్భవిస్తుంది. ఓ వైపు చెట్టు పెరుగుతుంది, మరోవైపు చుక్కలా బల్బు వెలుగుతుంది!   

(చదవండి: స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లబడతాయా..? సైన్స్‌ ఏం చెబుతోందంటే..)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)