Breaking News

బాహుబలి రోబో...రోజుకు 8 టన్నుల పండ్లు చ​కా చకా!

Published on Tue, 01/07/2025 - 11:38

బత్తాయి చెట్ల నుంచి పండ్లు కోసే రోబోని ఇజ్రేలుకు చెందిన కంపెనీ నానోవెల్‌ రూపొందించింది. దీనికి వివిధ ఎత్తుల్లో 6 రోబోటిక్‌ చేతుల్ని అమర్చారు. తోట మధ్యలో వెళ్తూ చెట్టు కొమ్మలకు తగినంత సైజు పెరిగిన, పక్వానికి వచ్చి రంగు మారిన పండ్లను కృత్రిమ మేధతో గుర్తించి కోసేలా దీన్ని రూపొందించారు. వాక్యూమ్‌ టెక్నాలజీతో పండును పట్టుకొని, తొడిమెను కత్తిరిస్తుంది. చేతిలోకి వచ్చిన పండు కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా బుట్ట లోకి చేరుతుంది. ఈ పనులన్నీ రోబో తనంతట తానే చేసేస్తుంది. దూరం నుంచి చూస్తే చిన్న చక్రాలున్న షెడ్డు మాదిరిగా కనిపించే ఈ రోబో.. ప్రస్తుతం ఒక ట్రాక్టర్‌ లాక్కెళ్తూ ఉంటే పండ్లను కోస్తుంది. మున్ముందు ట్రాక్టర్‌ అవసరం లేకుండా తనంతట తానే కదిలి వెళ్లేలా దీన్ని మెరుగు పరచనున్నట్లు నానోవెల్‌ కంపెనీ ప్రకటించింది. 

అమెరికాలోని కాలిఫోర్నియా  ప్రాంతంలో భారీ బత్తాయి తోటల యజమానులను కోత కూలీల కొరత వేధిస్తోంది. ఈ రోబో వారికి ఊరటనిస్తుందని నానోవెల్‌ ఆశిస్తోంది. కాలిఫోర్నియా సిట్రస్‌ రీసెర్చ్‌ బోర్డుతో ఒప్పందం చేసుకున్న ఈ కంపెనీ బత్తాయిలు కోసే ఈ రోబో పనితీరును కాలిఫోర్నియా బత్తాయి, నారింజ తోటల్లో పరీక్షంచబోతున్నది. అక్కడి భారీ కమతాల్లో సాగయ్యే సిట్రస్‌ పండ్ల తోటల అవసరాలకు అనుగుణంగా ఈ రోబోకు అవసరమైన మార్పులు చేర్పులు చేయబోతున్నారు. 

ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లండన్‌లో జరిగే వరల్డ్‌ అగ్రి–టెక్‌ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌లో కూడా ఈ రోబోను ప్రదర్శించబోతున్నామని నానోవెల్‌ సీఈవో ఇసాక్‌ మేజర్‌ చెప్పారు. భారీ తోటల్లో పండ్ల కోత కూలీల కొరతను ఎదుర్కొంటున్న అమెరికా, స్పెయిన్, ఇటలీ తదితర దేశాల్లో ఈ భారీ రోబోకు ఆదరణ బాగుంటుందని భావిస్తున్నామన్నారు. అంటే, సమీప భవిష్యత్తులో భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఇటువంటి రోబోలు రాబోతున్నాయి. 

పండ్లను కోయటంతో పాటు మిగిలిన కాయలు ఎన్ని ఎప్పటికి కోతకు వస్తాయి? తోటలో చెట్ల స్థితిగతులపై కూడా గణాంకాలను ఈ రోబో సేకరించటం వల్ల తోట యజమానులకు వెసులుబాటు కలుగుతుంది. 

ఆరు రోబోటిక్‌ చేతులతో ఏకకాలంలో పనిచేసే ఈ భారీ రోబో గంటకు బుట్ట (400 కిలోల) ఆరెంజ్‌లను కోయగలదు. రాత్రీ పగలు తేడా లేకుండా 24 గంటల్లో 20 బుట్టల (8 టన్నులు) పండ్లు కోయగలదు. అందువల్ల దీన్ని ‘బాహుబలి రోబో’ అనొచ్చు! ఇక ధర ఎంతో.. అంటారా? అది కూడా భారీగానే ఉంటుంది మరి!

 

Videos

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు