రామ్‌ లల్లా దర్శనం: సోనూ నిగమ్‌ భావోద్వేగం, బీ-టౌన్‌ సెల్ఫీ వైరల్‌

Published on Mon, 01/22/2024 - 15:53

 #AyodhyaRamMandir  శతాబ్దాల సుధీర్ఘ నిరీక్షణ ఫలించిన వేళ... ఎంతో  ఉత్కంఠగా ఎదురు చూసిన  బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  చేతులు మీదుగా  ఘనంగా జరిగింది.   ఈ వైభవాన్నిప్రత్యక్షంగా, పరోక్షంగా కన్నులారా వీక్షించిన భక్తుల  రామనామ స్మరణతో యావద్దేశం  పులకించిపోయింది.  ఈ సందర్బంగా కొన్ని విశేషాలు  సోషల్‌ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ కార్యక్రమం  అనంతరం  అక్కడున్న వారినందరినీ ప్రధాని మోదీ పలకరించారు. ప్రముఖగా  బాలీవుడ్‌ నటుడు బిగ్‌బీ, అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌లతోపాటు,  రిలయన్స్‌ అధినేత అంబానీ దంపతులను పలకరించి  అభివాదం  చేశారు.

 బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ కూడా  ఆనంద పరవశంలో మునిగి  జైశ్రీరామ్‌ అంటూ నినదించింది.

అలాగే  ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు అయోధ్య తరలివెళ్లిన బాలీవుడ్‌ నటులు  దిగిన సెల్ఫీ కూడా  విశేషంగా ఆకట్టుకుంటోంది. 

రామ​ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలో బాలీవుడ్‌  సుభాష్  ఘాయ్‌  అంబానీ కోడలు శ్లోకా అంబానీతోపాటు  బీ-టౌన్ ప్రముఖులతో కలిసి సెల్ఫీ తీసుకోవడం  విశేషం.


అలాగే   బాలీవుడ్‌  సింగర్‌ సోనూ నిగమ్‌  భావోద్వేగానికి గురయ్యాడు. అభి కుచ్ బోల్నే కో హై నహీ, బస్ యాహీ (కన్నీళ్లు) బోల్నే కో హై. (ఇపుడిక మాట్లాడానికి ఏమీలేదు ఆనంద బాష్పాలు తప్ప అంటూ ఆయన పరవశించిపోయారు. ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముందు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో  సోను నిగమ్  'రామ్ సియారామ్'   పాటను ఆలపించారు.

కాగా ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించేందుకు  అమితాబ్ బచ్చన్ నుండి సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుల గాత్రంతో అయోధ్యనగరి రామభజనలతో ఉర్రూతలూగింది. ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు ప్రముఖ గాయకులు రామ్ భజనలు ఆలపించారు.  అనురాధ పౌడ్వాల్, శంకర్ మహదేవన్, సోనూ నిగమ్‌ల మధురమైన గాత్రాలకు రామ్ భక్తులు  భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Photos

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)