Breaking News

వజ్రాల వ్యాపారి రాముడికి సమర్పించిన విరాళమెంత?

Published on Tue, 01/30/2024 - 13:52

జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట  వేడుక శ్రీరాముని జన్మభూమిలో ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహించిన చారిత్రాత్మక ఘట్టాన్న ప్రపంచవ్యాప్తంగా అనేకమంది భక్తులు చూసి తరించారు. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, అయోధ్యలో రామ మందిర నిర్మాణంకోసం భక్తులు విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కేవలం 45 రోజుల్లోనే పది కోట్ల మందికి పైగా ప్రజల నుంచి 2,500 కోట్లు వచ్చాయి.

రూ. 68 కోట్ల విలువ చేసే బంగారం
ఈ క్రమంలో సూరత్‌కుచెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లఖీ ఇచ్చిన విరాళం విశేషంగా నిలుస్తోంది. ఇదే  రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందిన అతిపెద్ద విరాళంగా భావిస్తున్నారు. రూ. 68 కోట్లు విలువ చేసే 101 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ బంగారాన్ని గర్భగుడి, ఆలయ స్తంభాలు, తలుపులు, బలరాముడి ఆలయంలోని డ్రమ్, త్రిశూల్ వంటి నిర్మాణాలలో ఉపయోగించారట.

ఎవరీ దిలీప్ కుమార్  లఖి 
దిలీప్ కుమార్  లఖి  తండ్రి కూడా వజ్రాల వ్యాపారి . 1947లో విభజనకు రెండు సంవత్సరాల ముందు 1944లో జైపూర్ వచ్చారు. చిన్నప్పటి నుండే దిలీప్ కుమార్, కుటుంబ వ్యాపారంలో సాయం చేస్తూ డైమండ్‌ వ్యాపారంలో రాణించారు. ప్రస్తుతం సూరత్‌లో ప్రపంచంలోని అతిపెద్ద డైమండ్ పాలిషింగ్ ఫ్యాక్టరీకి యజమాని.   6వేలకు పైగ ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తారు.  థాయిలాండ్,  అమెరికా, దుబాయ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా శాఖలు ఉన్నాయి

రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ 33 కిలోల బంగారం, 2.51 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. అలాగే దేశంలోని బిలియనీర్లు ఎంత ఇచ్చారో స్పష్టంగా తెలియనప్పటికీ వారితో పోలిస్తే  దిలీప్‌ చాలా బెటర్‌ అంటున్నారు నెటిజన్లు.

అయోధ్యకు ఆర్థిక ఊతం
మరోవైపు వాణిజ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,అయోధ్య రామమందిరం ఇప్పుడు దేశంలోని అతిపెద్ద పర్యాటక కేంద్రంగా మారబోతోంది.  అయోధ్య ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)