Breaking News

వాల్‌నట్స్‌ తింటున్నారా..?ఐతే అలాంటివాళ్లు మాత్రం..!

Published on Sat, 07/27/2024 - 13:10

వాల్‌నట్స్‌ సూపర్‌ హెల్తీ నట్స్‌. ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలతో నిండి ఉంటాయి. దీనిలో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. అధిక పోషకాలు కలిగిన వాల్‌నట్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌ను ఉంటాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, అలాంటి  వ్యాధి ఉన్నవారికి ఈ వాల్‌నట్స్‌ ఎంత మాత్రం మంచివి కావని తేల్చి చెబుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎలాంటి వ్యాధులు ఉన్నవారు వీటిని తీసుకోకూడదు?ఎందుకని..? తదితరాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

డయాబెటిస్‌తో బాధపడుతున్ వారికి ఈ వాల్‌నట్స్‌ వారి మూత్రం ఆమ్లత్వానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. మూత్రంలో కాల్షియం ఆక్సలేట్‌ అధిక సాంద్రతలు క్రిస్టలైజ్‌ అవ్వడంతో ఈ రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు మూత్రపిండాల నుంచి మూత్రనాళంలోకి ప్రయాణించి మూత్రప్రవాహాన్ని అడ్డుకుని ఇన్ఫెక్షన్‌ లేదా రక్తస్రావాన్ని కలిగిస్తాయి. 

మూత్రపిండాల్లో రాళ్ల సంకేతాలు, లక్షణాలు

  • వికారం, వాంతులు

  • మూత్ర విసర్జనలో రక్తం

  • మూత్ర విసర్జన చేసినప్పుడు నొప్పి

  • మూత్ర విసర్జన చేయలేకపోవడం

  • మూత్ర విసర్జన చేయాలనే కోరిక విపరీతంగా ఉండటం

  • జ్వరం లేదా చలి

  • దుర్వాసనతో కూడిన మూత్ర విసర్జన

డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎన్ని వాల్‌నట్స్‌ తినాలి..?

మధుమేహం ఉన్నవాళ్లు రోజువారీగా వాల్‌నట్‌లను 30 నుంచి 50 గ్రాములకు పరిమితం తీసుకుంటే మంచి ప్రయోజనాలను పొందగలరు. ఒక అధ్యయనం ప్రకారం, ఎనిమిది వారాలపాటు ప్రతిరోజూ 43 గ్రాములు లేదా 1.5 ఔన్సుల వాల్‌నట్‌లను తినడం వల్ల మచి సానుకూలా ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. 

ప్రయోజనాలు

  • రోగనిరోధక శక్తిని పెంచుతాయి

  • ఇతర సాధారణ గింజల కంటే వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. 

  • ఇందులో విటమిన్ ఈ, మెలటోనిన్,  పాలీఫెనాల్స్ వంటి మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. 
    వాపును తగ్గిస్తాయి

  • వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె సమస్యలు, టైప్ -2 డయాబెటిస్, అల్జీమర్స్, కేన్సర్ వంటి వ్యాధులకు చెక్‌పెడుతుంది. వాల్‌నట్‌లోని పాలీఫెనాల్స్ ఆక్సీకరణ ఒత్తిడి, వాపుతో పోరాడటానికి సహాయపడతాయి.

  • ఆరోగ్యకరమైన ప్రేగులను ప్రోత్సహిస్తుంది.. అధ్యయనాల ప్రకారం, ఇందులో గట్‌ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులు పుష్కలంగా ఉంటాయి. ఇది  ప్రేగు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కాబట్టి, వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తింటే మైక్రోబయోటా, గట్  ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది.

  • ఆహారంలో వాల్‌నట్‌లను చేర్చుకోవడం వల్ల రొమ్ము, ప్రోస్టేట్‌, కొలొరెక్టల్ కేన్సర్‌తో సహా కొన్ని రకాల కేన్సర్‌ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వాల్‌నట్స్‌లో ఎల్లాగిటానిన్స్‌ అనే పాలీఫెనాల్స్‌ నిండి ఉంటాయి కాబట్టి. కొన్ని గట్ సూక్ష్మజీవులు వీటిని యురోలిథిన్స్ అని పిలిచే సమ్మేళనాలుగా మార్చగలవు.
     

  • వాల్‌నట్‌లు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, శరీరం వాటి పోషకాల ఆధారంగా ఊహించిన దాని కంటే 21 శాతం తక్కువ శక్తిని గ్రహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల ఇది ఆకలిని నియంత్రిస్తుంది, జీవక్రియను పెంచుతుంది, తద్వారా బరువు తగ్గడం లేదా నిర్వహణలో సహాయపడుతుంది.

(చదవండి: ఏసీలో పడుకుంటున్నారా..? ఐతే ఈ సమస్యలు తప్పవు..!)

 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)