Breaking News

అవోకాడో వర్సెస్‌ ఆలివ్ ఆయిల్: ఆరోగ్యానికి ఏది మంచిది?

Published on Tue, 09/24/2024 - 17:30

అవోకాడో, ఆలివ్‌ రెండూ ఆరోగ్య ‍ప్రయోజనాలకు ప్రసిద్ధిగాంచినవే. ఇవి రెండు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం, వాపును తగ్గించడం పరంగా గుండె ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్‌ అని ప్రత్యేకంగా చెప్పాలంటే..వాటికి ప్రత్యేక పోషక విలువల ఆధారంగా వెల్లడించాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

పోషకాల పరంగా రెండిటిలోనూ వేర్వేరు ప్రత్యేక పోషకాల ప్రొఫైల్‌ని కలిగి ఉంటాయి. అవేంటో సవివరంగా చూద్దాం..

కొవ్వుల పరంగా చూస్తే..
రెండు నూనెల్లో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ని తగ్గించి మంచి  కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌)ని పెంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. అవోకాడో నూనె కంటే ఆలివ్‌ నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వులలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వులు వాపును తగ్గిస్తాయి. పైగా హృదయనాళ పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే అవోకాడో నూనె కూడా గుండెకి సంబంధించిన ఆరోగ్యకరమైన కొవ్వుల మూలం. పైగా ఎక్కువ పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులను (మంచి ఒమేగా-6 కొవ్వులు) కలిగి ఉంది.  అలా అని అధిక మొత్తంలో తీసుకుంటే మంటను కలిగించే అవకాశం ఉన్నందున అవకాడోని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

యాంటీఆక్సిడెంట్లు, పోషక సాంద్రత
ఆలివ్ ఆయిల్‌లోని పాలీఫెనాల్స్ కణాలు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. మెరుగైన గుండె ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అవకాడో నూనెలో తక్కువ పాలీఫెనాల్స్ ఉన్నప్పటికీ, ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి తోడ్పడటమే గాక శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రెండు నూనెలు ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలను కూడా కలిగి ఉంటాయి. అందువల్ల ఆలివ్‌ ఆయిల్‌ అధిక ప్రాముఖ్యత ఇవ్వక తప్పదని చెబుతున్నారు నిపుణులు.

వంట పరంగా..
అవోకాడో నూనెలో ఆలివ్ నూనె కంటే ఎక్కువ స్మోక్ పాయింట్ ఉంటుంది. ఇది వేయించడానికి లేదా గ్రిల్ చేయడం వంటి అధిక వేడి వంటలక అనుకూలం. ఆలివ్ నూనె తక్కువ వేడి వంటకు లేదా సలాడ్‌లు, డిప్‌లలో ఫినిషింగ్ ఆయిల్‌గా బాగా సరిపోతుంది. రెండు నూనెలు వేడిలో స్థిరంగా ఉన్నప్పటికీ, అవోకాడో నూనె అధిక వేడి వంట కోసం ఉపయోగించినప్పుడు దానిలో పోషకాలను బాగా నిలుపుకుంటుంది. ఈ విధంగా చూస్తే అవోకాడో నూనె ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం కారణంగా  ఇదే బెస్ట్‌ అని చెప్పొచ్చు.

రుచికి..
ఆలివ్ నూనె అదనపు పచ్చి కొంచెం చేదుతో  ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఇది సలాడ్‌లు, డ్రెస్సింగ్‌లు, మధ్యధరా వంటకాల రుచిని పెంచుతుంది. అవోకాడో నూనె దీనికి విరుద్ధంగా తేలికపాటి తటస్థ రుచిని కలిగి ఉంటుంది. ఇది వంటల రుచిని మారకూడదంటే ఇది బెస్ట్‌. 

అవకాడో ఆయిల్, ఆలివ్ ఆయిల్ రెండూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఆలివ్ నూనెలోని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ గుండె ఆరోగ్యానికి ది బెస్ట్‌గా చెప్పొచ్చు.  పైగా తక్కువ వేడి వంటకు అనువైనది. అవోకాడో నూనె అధిక వేడి వంటలకు సరైన ఎంపిక. అలాగే చర్మ సంరక్షణ కోసం విటమిన్ 'ఈ'ని అందిస్తుంది. రెండింటిని జీవన విధానంలో భాగం చేసుకోండి కానీ గుండె ఆరోగ్య రీత్యా ఆలివ్‌ ఆయిల్‌కి అధిక ప్రాధాన్యత ఇవ్వవల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.

(చదవండి: మెటాస్టాటిక్ బ్రెస్ట్ కేన్సర్‌ రోగులు మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే..?)

 

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)