Breaking News

చనిపోయిన భర్త నుంచే పిల్లలు పొందాలని.. ఆమె ఏకంగా..!

Published on Wed, 01/10/2024 - 10:21

ఇటీవల కాలంలో చనిపోయిన భర్త నుంచే పిల్లలను కన్న ఓ మహిళ గురించి విన్నాం.  ఆకేసులో ఆ దంపతులు పిల్లలు పుట్టకపోవడంతో ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌(ఐవీఎఫ్‌)  ఆస్పత్రిని ఆశ్రయించారు. ఆ పద్ధతిలో పిల్లను కనాలనుకునేలోపు కరోనా మహమ్మారి రావడం భర్త చనిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. ఒంటిరిగా అయిపోయిన ఆ భార్య తన భర్త ఉన్నప్పుడు పిల్లలను కనాలనుకున్న ఘటన గుర్తొచ్చి ఆస్పత్రికి వెళ్లి తన నిర్ణయాన్ని తెలిపి మరీ సాహసోపేతంగా బిడ్డను కని వార్తల్లో నిలిచింది. అది మరువక మునుపే అదే మాదిరి ఘటన కాకపోతే కొద్ది తేడా ఉంది. అక్కడ బతికుండగానే భర్త నుంచి స్పెర్మ్‌ తీసుకున్నారు. ఇక్కడ ఈ జంట కనాలనుకునేలోపే భర్త  అకాల మరణం పొందాడు. అయినా తన భర్త నుంచే పిల్లలను కనాలనుకుంటున్నా అంటూ అందుకు పర్మిషన్‌ ఇమ్మని ఏకంగా సుప్రీం కోర్టునే ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంది. ఈ ఆశ్చర్యకర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..వెస్ట్‌ ఆస్ట్రేలియాకు చెందిన 62 ఏళ్ల మహిళ ఆమె భర్త తమ ఇద్దరు పిల్లలను వేర్వేరు ఘటనలు పోగొట్టుకున్నారు. దీంతో ఇరువురు పిల్లను కనాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే అనుకోకుండా ఇటీవలే డిసెంబర్‌ 17న భర్త ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆమె తన భర్త బతికుండగానే పిల్లలను కనాలనుకున్న దాన్ని నిజం చేయాలనుకుంది. చనిపోయినప్పటికీ తన భర్త నుంచే పిల్లలను కనాలనుకుంది. అందుకోసం అని చనిపోయిన భర్త నుంచి స్పెర్మ్‌ని సేకరించాలనుకుంది. దీనికి సుప్రీం కోర్టు అనుమతివ్వాలంటూ అభ్యర్థించింది.

తన భర్త బతికున్నప్పుడే తామిరువురం అనుకున్నామని, తన భర్త కోరికని అనుమతిమ్మని కోర్టుని వేడుకుంది. దీంతో ధర్మాసనం చనిపోయిన భర్త నుంచి స్పెర్మ్‌ని తీసుకునేందు అనుమతి మంజూరుచేసింది. ఇక్కడ ఓ చనిపోయిన వ్యక్తి స్పెర్మ్‌ ఫలదీకరణం చెందించేలా ఉపయోగించడం అనేది వైద్యశాస్త్రంలో మరింత పురోగతికి నాంది పలుకుతుందనే చెప్పాలి. ఇక ఆ జంట పిల్లలు 2013లో కుమార్తె(29) ఫిషింగ్‌ ట్రిప్‌లో మరణించగా, కుమారుడు(30) కారు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆ జంట ఐవీఎఫ్‌ పద్ధతిలో పిల్లను కనాలని అనుకుంది. అయితే పిల్లలను కనే వయసు సదరు మహిళకు దాటిపోవడంతో సరోగసి ద్వారా పిల్లలను పొందాలనుకున్నారు.

ఈలోగా అనుకోకుండా భర్త దూరమవ్వడంతో ఆ కోరిక కలగా మిగిలిపోకూడదని ఆ మహిళ స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించి చనిపోయిన భర్త నుంచే స్పెర్మ్‌ని సేకరించేలా అనుమతి పొందింది. కాగా, మరణాంతర ఫలదీకరణంపై వెస్ట్‌ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. అందువల్ల ఆమె సరోగసి ద్వారా బిడ్డను పొందాలనుకుంటే..ముందుగా సదరు మహిళ స్త్రీ పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞాన మండలికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆమె దివగంత భర్త తండ్రి కావాలనుకున్నాడా? అలాగే సదరు మహిళ చెబుతోంది అంతా నిజమేనా? అన్నది నిర్థారణ చేసుకుని ఆస్ట్రేలియా వైద్యాధికారులు అనుమతి ఇస్తేనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక అధికారులు సదరు మహిళ వివరాలను చాలా గోప్యంగా ఉంచారు.

(చదవండి: ఒక లీటర్‌ బాటిల్‌లో ఎన్ని నానో ప్లాస్టిక్‌ కణాలు ఉంటాయో తెలుసా! వెలుగులోకి షాకింగ్‌ విషయాలు!)

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)