Breaking News

మానవ ఐవీఎఫ్‌ సాయంతో కంగారూ పిండాలు..!

Published on Thu, 02/06/2025 - 11:10

వాతవరణ మార్పులు, కాలుష్యం కారణంగా ఇప్పటికే పలు జంతు జాతులు అంతరించిపోతున్నాయి. పర్యావరణ ప్రేమికులు వాటిన సంరక్షించేందుకు పలు విధాలు ప్రయత్నిస్తున్నారు. ఆ నేపథ్యంలో తాజాగా శాస్త్రవేత్తలు ఆ అంతరించిపోతున్న జాతుల పరీరక్షణకు మార్గం సుగమం చేసేలా తొలిసారిగా మానవ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ఉపయోగించారు. దీని సాయంతో అంతరించిపోతున్న జాతుల పిండాలను విజయంతంగా సృష్టించి సరికొత్త పరిష్కారానికి నాంది పలికారు. ఇంతకీ ఈ ఐవీఎఫ్‌ని ఉపయోగించి ఏ జంతు పిండాలను సృష్టించారంటే..

ఆస్ట్రేలియన్‌ శాస్త్రవేత్తలు(Australian Scientists) తొలిసారిగా ఐవీఎఫ్‌ని ఉపయోగించి అంతరించిపోతున్న మార్సుపియల్ జాతి కంగారు పిండాలను(kangaroo embryos) విజయవంతగా సృష్టించారు. ఇలా మానవ ఐవీఎఫ్‌ సాయంతో జంతు పిండాలను ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో ఉండే ఈ మార్సుపియల్‌(marsupial species) అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. ఈ జాతికి సంబంధించిన కోలాస్, టాస్మానియన్ డెవిల్స్, నార్తర్న్ హెయిరీ-నోస్డ్ వొంబాట్స్,  లీడ్‌బీటర్స్ పోసమ్స్ వంటి కంగారు జాతులు అంతరించిపోతున్న దశలో ఉన్నట్లు చెబుతున్నారు పరిశోధకులు. 

ఆ జంతువులను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టినట్లు క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయ(Queensland University) పరిశోధకుడు డాక్టర్‌ ఆండ్రీస్‌ గాంబిని( Andres Gambini,) తెలిపారు. తమ పరిశోధనా బృందం మానవ IVFలో సాధారణంగా ఉపయోగించే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) ద్వారా 20 కి పైగా కంగారూ పిండాలను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఈ పరిశోధన కోసం తమ బృందం ఇటీవలే మరణించిన కంగారూల నుంచి స్పెర్మ్, గుడ్డు కణాలను సేకరించినట్లు వివరించారు. 

ఈ ఐవీఎప్‌కి బూడిద రంగు కంగారులే అనువైనవని గాంబిని చెబుతున్నారు. ఎందుకంటే వాటి జనాభా కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఉనికిలో ఉండటం కారణంగా వాటి జన్యు పదార్థం సమృద్ధిగా అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) జాతుల పరిరక్షణకు, సంతానోత్పత్తి ప్రయత్నాలలో గణనీయమైన ప్రయోజనాన్ని అందించిందని చెప్పారు.  దీనికోసం లక్షలాది స్పెర్మ్ సజీవంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ పరిశోధన విజయవంతం కావడంతో పరిశోధకులు జన్యువైవిధ్యాన్ని ప్రవేశ పెట్టేలా మరణించిన జంతువుల నుంచి జన్యు పదార్థాన్ని సంరక్షించడానికి ఐవీఎఫ్‌ని ఉపయోగించాలని పరిశోధన బృందం చూస్తోంది. 

అలాగే ఈ సృష్టించిన జంతువులు పర్యావరణానికి అనుకూలంగా మనుగడ సాగించాలే చూడటానికి ఈ జన్యువైవిధ్యం తప్పనిసరని అంటున్నారు. అదీగాక ప్రస్తుతం ఆస్ట్రేలియాలో క్షీరదాల క్షీణత రేటు భయానకంగా ఉంది. ఇప్పటికే 38 జాతులు కనుమరుగైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ పరిశోధన సరికొత్త ఆశను అందిస్తోంది. 

(చదవండి:

 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?