Breaking News

నర్సుల విశాల హృదయం..సేవతో కొత్త ఏడాదికి స్వాగతం..!

Published on Tue, 12/31/2024 - 15:24

హైదరాబాద్‌(​Hyderabad) న‌గ‌ర వీధుల్లో చ‌లికి గ‌జ‌గ‌జ వ‌ణుకుతూ ఇబ్బంది ప‌డుతున్న నిరుపేద‌లు, నిర్భాగ్యుల‌((Homeless People)ను ఆదుకునేందుకు ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రి(Aster Prime Hospital) న‌ర్సులు(Nurses) స‌హృద‌యంతో ముందుకొచ్చారు.  ఎస్ఆర్ న‌గ‌ర్ ప్రాంతంలో వీధుల్లో ఉంటున్న సుమారు 50 మంది నిరుపేద‌ల‌కు ర‌గ్గులు పంచిపెట్టారు. సుమారు 120 మంది న‌ర్సులు తాము సంపాదించిన దాంట్లోంచి త‌లా కొంత వేసుకుని ఈ ర‌గ్గులు కొని, వీధుల్లో ఉంటున్న‌వారికి ఉచితంగా పంచిపెట్టారు. 

ప్ర‌తిరోజూ ఆస్ప‌త్రిలో సేవ‌లు అందిస్తున్న ఏంజెల్ న‌ర్సులు ఈసారి కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఏదైనా మంచి ప‌ని చేయాల‌ని త‌ల‌పెట్టి, నిరుపేద‌ల‌ను చ‌లి నుంచి ర‌క్షించేందుకు ర‌గ్గులు పంచాల‌ని నిర్ణ‌యించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ఎస్ఆర్ న‌గ‌ర్ ప్రాంతానికి వెళ్లి, అక్క‌డ రోడ్ల‌పై ఉంటున్న 50 మందికి ఈ ర‌గ్గులు అందించారు. 

ఈ సంద‌ర్భంగా ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రి న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్ లిండామోల్ జోయ్ మాట్లాడుతూ, ప్ర‌తి సంవ‌త్స‌రం క్రిస్‌మస్‌, కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఏదో ఒక సంబ‌రాలు చేసుకుంటామ‌ని, ఈసారి అలా కాకుండా.. పేద‌ల‌ను ఆదుకోవ‌డానికి ఏమైనా చేస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న వ‌చ్చింద‌ని చెప్పారు. 

వెంట‌నే త‌మ న‌ర్సింగ్ గ్రూపులో పోస్ట్ చేయ‌గా, ఏంజెల్ న‌ర్సులు అంతా ముందుకొచ్చి త‌మ‌కు చేత‌నైనంత సాయం చేశార‌న్నారు. వ‌చ్చే ఏడాది కూడా మ‌రింత మంచి కార్య‌క్ర‌మాలు చేస్తామ‌న్నారు. న‌ర్స్ ఎడ్యుకేట‌ర్ రాహుల్ క‌మ‌ర్ మాట్లాడుతూ..అన్నీ ఉన్న మ‌న‌మే చ‌లిని త‌ట్టుకోలేక‌పోతున్నామ‌ని.. అలాంటిది కనీసం గూడు కూడా లేకుండా న‌డివీధిలో ప‌డుకుంటున్న నిర్భాగ్యుల‌ను చూసి తామంతా చ‌లించిపోయామ‌ని అన్నారు.

అందుకే ఈసారి వీరికి చ‌లిని త‌ట్టుకునేందుకు వీలుగా ర‌గ్గులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు. రాబోయే సంవ‌త్స‌రాల్లో కూడా ఆస్టర్ ప్రైమ్ ఆస్ప‌త్రి సిబ్బంది నిరుపేద‌ల‌ను ఆదుకునేలా వినూత్న కార్య‌క్ర‌మాలతో ముందుకు వ‌స్తార‌ని తెలిపారు.

(చదవండి: చిరుత ఎంట్రీతో..ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం ఆఫర్‌ ..!)

 

 

 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)