Breaking News

బాధించిన శారీరక ఎత్తునే చిత్తుచేసి.. ఐఏఎస్‌ స్థాయికి..

Published on Mon, 09/01/2025 - 16:47

పొట్టివాడైనా..గట్టివాడమ్మ అన్న నానుడిలా ..ఓ మహిళ అత్యున్నత స్థాయికి చేరుకుని శెభాష్‌ అనిపించుకుంది. అది శారీరక లోపం కాదు..విభిన్నంగా చూపే విశిష్ట లక్షణంగా భావించింది. అదే తన ఉన్నతికి సోపానంగా మార్చి.. తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్‌ చేసుకునే రేంజ్‌కి చేరుకుంది. తనను చూడగానే శారీరక లోపం కాదు..సాధించిన విజయమే తలంపుకు వచ్చేలా అందరి మదిలో చిరస్థాయిగా నిలిచేలా అనితర సాధ్యమైన సక్సెస్‌ని అందుకుని యావత్తు ప్రపంచం తనవైపుకి తిరిగేలా చేసుకుంది.

ఆమెనే డెహ్రాడూన్‌కి చెందిన ఆర్తి డోగ్రా. తన శారీరక ఎత్తు సమాజం నుంచి అవహేళనలు, అవమానాలను బహుమతులుగా అందంచింది. ఇంతేనా అనిపించేలా అడుగడుగున జాలి చూపులు. అందరిలో సులభంగా కలిసిపోయి ఇమడలేని పరిస్థితి. అయినా సరే ఈ పరిస్థితిని ఏదో అనితర సాధ్యమైన విజయంతో సమాధానమిచ్చేలా తన తలరాతను తిరిగి రాయాలని సంకల్పించింది. ఆ నేపథ్యంలో ఆర్తి మొండి పట్టుదలతో ముందుకెళ్లెందేకు ప్రయత్నించింది. 

అందుకు తండ్రి  కల్నల్‌ రాజేంద్ర డోగ్రా, అమ్మ కుంకుమ్ డోగ్రా చక్కటి ప్రోద్భలం అందించారు. అయితే తన శారీరక ఎత్తు ఎగతాళి, అవమానాల తోపాటు తన కెరీర్‌ అవకాశాలను మింగేస్తోందని తెలిసి కుంగిపోలేదు. దానికే సవాలు విసిరేలా అందనంత అత్యున్నత స్థాయిలో ఉండాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. అలా ఆమె డెహ్రాడూన్‌లో పాఠశాల విద్యను, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని, మాస్తర్స్‌ని పూర్తి చేసింది. 

చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థి అయిన ఆర్తి సివిల్స్‌ సర్వీస్‌ని ఎంపిక చేసుకుంది. అందుకు సన్నద్ధమైంది. ఆ క్రమంలో అవమానాలు, అవహేళనలు తప్పలేదు. అయినా తన ప్రయత్నం తనదే..అన్నట్లుగా సాగింది. ఈ అమ్మాయా ఐఏఎస్‌ అయ్యింది అని విస్తుపోయేలా అనితరసాధ్యమైన విజయఢంకా మోగించింది. అత్యంత పొట్టి ఐఏఎస్‌గా చరిత్ర సృష్టించి..ఎందరో సివిల్స్‌ ఔత్సాహిక అభ్యుర్థులుకు స్ఫూర్తిగా నిలిచింది. 

శారీరక లోపం అనేది మన అంతరంగంలో ఉన్న విశిష్ట శక్తిని మనకే పరిచయం చేసే సాధనంగా మలుచుకుంటే..సాధ్యం కాదనుకున్న విజయాలన్నీ ఒళ్లోకొచ్చి వాలిపోతాయంటోందామె. అంతేగాదు ఆ సక్సెస్‌ ఆమె శారీరక ఎత్తుని చూడనీయడం లేదు. ఈమె నాకు రోల్‌ మోడల్‌ అనిపించేలా ఆమె అత్యున్నత హోదా ప్రేరణ కలిగిస్తోంది. ఒక్క విజయంతో వేలెత్తి చూపే మాటలన్నింటికీ తగిన సమాధానం ఇవ్వడం అంటే ఇదే కదూ..!. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌లో సమాచార, సాంకేతిక కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

(చదవండి: హ్యక్‌ హా.. అప్‌డేట్‌ హా..?!)

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)