Breaking News

అన్నతో కలిసి గ్రాండ్‌గా ఈద్‌ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు

Published on Tue, 04/01/2025 - 14:39

రంజాన్‌ పర్వదినం సందర్బంగా వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి. ముఖ్యంగా  బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్ సోదరి  అర్పితా శర్మ ఖాన్ సోమవారం రాత్రి ఈద్ వేడుకలను ఘనంగా  నిర్వహించారు.  ఈ సందర్భంగా   సోదరుడితో కలిసి గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. పండుగ వేడుక, గ్లామర్ రెండింటినీ మిళితం చేసిన ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో పలువురు బాలీవుడ్‌ తారలు సందడి చేశారు. ఈద్ వేడుకలో సాంప్రదాయ లుక్స్‌లో అందరూ మంత్రముగ్ధుల్ని చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో విశేషంగా నిలిచాయి.

రంజాన్‌ సందర్బంగా  అర్పితా ఖాన్‌ ఇచ్చిన లావిష్‌ పార్టీకి అర్బాజ్ ఖాన్, అల్విరా ఖాన్ , ఆయుష్ శర్మ వంటి  కుటుంబ సభ్యులతోపాటు   పెళ్లి తరువాత తొలిసారి ఈద్‌ వేడుకలను జరుపుకుంటున్నసోనాక్షి సిన్హా, భర్తతో కలిసి హాజరైంది.అర్పితా శర్మ ఖాన్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ ఈద్ వేడుకలో, సోనాలి బింద్రే పింక్ సూట్‌లో అందంగా కనిపించింది.  

ఇంకా జెనీలియా,రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, షమితా శెట్టి, అంగద్ బేడి, నేహా ధుపియా తదితర బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

అంతకుముందు తన సోదరి   గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోని తన బాల్కనీ నుండి అభిమానులను పలకరించాడు. సల్మాన్   సోదరి అర్పితా కుమార్తె, మేనకోడలితో కలిసి అభిమానులకు కనువిందు చేశాడు. అధిక భద్రతా సమస్యల కారణంగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి  తెల్లటి కుర్తా-పైజామా ధరించి  ఫ్యాన్స్‌ను అభినందించారు. 

ఈ సందర్బంగా   సల్మాన్‌ మూవీ  "సికందర్" అంటూ  సందడి చేశారు. “షుక్రియా ధన్యవాదాలు ఔర్ సబ్ కో ఈద్ ముబారక్.” అంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి ఒక వీడియోను  ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)