Breaking News

Lavender : అద్భుతమైన ప్రయోజనాలు

Published on Fri, 06/14/2024 - 17:45

వర్షాలు మొదలయ్యాయంటే చాలు దోమలు, కీటకాల బెడద ఎక్కువ అవుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, చుట్టు పక్కల మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమ తెరలు వాడటంతో పాటు, ఇంట్లో కొన్ని రకాలు మొక్కల్ని పెంచుకోవడం ద్వారా దోమలు, పురుగుల బాధనుంచి తప్పించు కోవచ్చు. తులసి, పుదీనా,  గోధుమ గడ్డి, లావెండర్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు.  లావెండర్‌ మొక్కను ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు.  అంతేకాదు లావెండర్‌ ఆయిల్‌, పువ్వుల  వలన ఆరోగ్యప్రయోజనాలు లాభాలున్నాయి. అవేంటో చూద్దాం.

లామియాసి లేదా పుదీనా కుటుంబానికి చెందిన పుష్పించే మొక్కను లావెండర్ అని పేరు. దీని బొటానికల్ పేరు లావెండర్ అఫిసినాలిస్. లావెండర్ అందమైన పుష్పాలనిస్తుంది. లావెండర్‌ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి పురుగుల, కీటకాలు రావు. ఈగలు, దోమల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. చీమలు, సాలె పురుగులు కూడా కనిపించవు. ఎందుకంటే  ఈ మొక్క నుంచి వచ్చే వాసన వాటికి పడదట. లావెండర్‌ మొక్క, దాని వాసన మనకు మాత్రం  ఆరోగ్యాన్ని అందిస్తుంది.  

ప్రత్యేకమైన రుచి కోసం కుకీలు, కేకుల్లో వీటిని వాడతారు. టీ, సిరప్ లలో ఈ లావెండర్ పువ్వులను వినియోగిస్తారు. అలాగే తీపి కాస్త పులుపు రుచితో ఉండే పువ్వులను చక్కగా తీసుకొని తినవచ్చు. పచ్చిగా తినలేనివారు టీ రూపంలో లావెండర్ పువ్వులను తింటారు కూడా.
 

లావెండర్‌ మొక్కలతో మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆందోళన తగ్గుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. అంతేకాదు ఈ మొక్కనుంచి  తీసిన ఆయిల్ అత్యంత ప్రజాదరణ పొందిన  ఆయిల్‌  ఒకటి. ఈ నూనెను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, అరోమాథెరపీలో ఉపయోగిస్తారు. లావెండర్ ఆయిల్ జీర్ణక్రియను మెరుగు పరచడానికి ఉపయోగిస్తారు. ఇది  చర్మాన్ని కాంతివంతం చేయడంలో  మొటిమలను తగ్గించడంలో సహాయ పడుతుంది. ముడతలను తగ్గిస్తుంది. 

ఈ అద్భుతమైన నూనె బ్యాక్టీరియాను చంపడానికి పని చేస్తుంది.  లావెండర్ ఆయిల్‌లోని యాంటీ ఫంగల్ లక్షణం మంటను, వాపును తగ్గిస్తుంది. ఇది ఎగ్జిమాను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు సంరక్షణలో కూడా  పనిచేస్తుంది.

 

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)