Breaking News

సింగర్‌లా కనిపించాలని సర్జరీ.. ఇప్పుడేమో సగం మొహానికి స్పర్శ లేదు, ముక్కు, మూతి చూస్తే..

Published on Sun, 07/02/2023 - 12:41

అభిమానం వెర్రితలలు వేస్తే ‘ఫ్రాన్‌ మారియానో’లా ఉంటుంది. అతను అర్జంటీనా వాసి. స్పానిష్‌ (ప్యుర్టో రికా) గాయకుడు, పాటల రచయిత, నటుడు రికీ మార్టిన్‌ వీరాభిమాని! సాధారణంగా అయితే సెలబ్రిటీల అభిమానులు.. సెలబ్రిటీల అభినయ, ఆహార్య, వాచకాలను అనుకరిస్తూ ఆనందపడుతుంటారు. కానీ ఫ్యాన్‌ ఫ్రాన్‌ మారియానో మాత్రం తన రూపు రేఖలనే మార్చేసుకున్నాడు కనుబొమలు సహా! అచ్చం రికీలాగే కనిపించాలనే కోరికతో ఏకంగా డజన్‌కి పైగా కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకున్నాడు.

తన కనుబొమలు కూడా రికీ మార్టిన్‌ కనుబొమలను పోలి ఉండాలని మోటార్‌ ఆయిల్‌ ఇంజెక్షన్‌ చేయించుకున్నాడు. ఈ ప్రకియంతా అతన్ని త్రీవమైన శారీరక, మానసిక వ్యధలోకి నెట్టింది. ఇప్పుడు అతను ఇటు తనలా కాకుండా అటు రికీ మార్టిన్‌లా కాకుండా తయారయ్యాడు. ఈ మధ్యే ఓ రియాలిటీ షో (అర్జంటీనా)లో తనలాంటి ఫ్యాన్స్‌కి తన అనుభవాన్ని చెబుతూ ఏ అభిమానీ తనలా మారొద్దని.. అభిమానాన్ని హద్దులు మీరనివ్వద్దని హెచ్చరించాడు.

‘నా ముక్కు, మూతి నావి కాకుండా పోయాయి. నా సగం మొహానికి స్పర్శే తెలియడం లేదు. మంచినీళ్లనూ గటగటా తాగలేని పరిస్థితి.. కర్చీప్‌ని నీళ్లలో ముంచి నోట్లో పిండుకోవాల్సి వస్తోంది’ అని వాపోతున్నాడు మారియానో. ఇతని గాథ విన్నవాళ్లంతా ‘ప్చ్‌ .. క్రేజీ ఫెలో.. ’ అంటూ జాలిపడుతున్నారు.

చదవండి: ఇదేం ఆచారం.. వధువు నెత్తి కొట్టుకుంది.. ఘటనపై మహిళా కమిషన్‌ సీరియస్‌

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)