అర్చన... అనుకున్నది సాధించింది

Published on Sat, 06/17/2023 - 06:40

‘నేర్చుకోవాలి’ అనే తపన ఉంటే ఏ విద్య అయినా చేతికి చిక్కుతుంది. సైకిల్‌ తొక్కడం కూడా రాని అర్చనా ఆత్రమ్‌ పెద్ద బస్సును నైపుణ్యంగా నడుపుతూ ‘భేష్‌’ అనిపించుకోవడానికి ఆ తపనే కారణం.... మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ (ఎంఎస్‌ఆర్‌టీసీ) తొలి మహిళా డ్రైవర్‌గా వార్తల్లో నిలిచింది అర్చనా ఆత్రమ్‌. నాందేడ్‌ జిల్లాలోని కివ్వత్‌ తాలూకలోని సర్కానీ గ్రామానికి చెందిన అర్చన డ్రైవింగ్‌ ఫీల్డ్‌ను ఎంచుకోవడం తండ్రికి నచ్చలేదు. బంధువులు ‘అది ఆడవాళ్లు చేసే ఉద్యోగం కాదు’ అన్నారు.

కొందరైతే...‘నీకు సైకిల్‌ తొక్కడమే రాదు. బస్సు నడుపుతావా!’ అని బిగ్గరగా నవ్వేవాళ్లు. ఎన్నో ప్రతికూల మాటలను ఈ చెవిన విని ఆ చెవిన వదిలేసిందేగానీ ఒక్క అడుగు వెనక్కి వేయలేదు అర్చన. ‘పట్టుదల ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు’ అంటున్న అర్చన పుణెలో జరిగిన శిక్షణ తరగతులలో ఎన్నో విషయాలు నేర్చుకుంది. క్లచ్, గేర్‌ అంటే ఏమిటో తెలియని అర్చన జీరో నుంచి ప్రయాణం ప్రారంభించి హీరో అయ్యింది. డిపో మేనేజర్‌ నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరకు ఎంతో మంది అర్చనా ఆత్రమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)