Breaking News

1200 ఏళ్ల నాటి పురాతన సమాధి..అందులో ఏకంగా కోట్లు..!

Published on Mon, 03/11/2024 - 12:58

మరో పురాతన నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు దక్షిణ అమెరికా దేశంలోని పనామా సిటిలో బయటపడ్డాయి. సుమారు 12 శతాబ్దాల నాటి సమాధి తవ్వుతుండగా భారీ ఎత్తున బంగారం, విలువైన వస్తువులు బయటపడటంతో శాస్త్రవేత్తలు షాక్‌కి గురయ్యారు. ఈ నిధి మధ్య అమెరికాలో పనామా సిటీకి సుమారు 110 మైళ్ల దూరంలో ఉన్న ఎల్‌కానో ఆర్కియాలాజికల్‌ పార్క్‌ వద్ద తవ్వకాలు జరుపుతుండగా వెలుగులోకి వచ్చింది. సమాధిలో పెద్ద ఎత్తున బంగారు నిధి తోపాటు చాలా మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి.

ఇది అమెరికాలో యూరోపియన్‌ రాకకు ముందు జీవించిన స్థానిక తెగల జీవితాలను గురించి తెలియజేస్తోంది. ఈ సమాధి ఒక ముఖ్యమైన చారిత్రక  సాంస్కృతిని ఆవిష్కరిస్తుందని చెప్పొచ్చు. ఆ సమాధిలో బంగారు శాలువా, బెల్టులు, ఆభరణాలు, తిమిగలం పళ్లతో చేసిన చెవిపోగులు, విలువైన వస్తువు ఉన్నాయని పురావస్తు శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జూలియా మాయో వివరించారు. అందులో సుమారు 32 మృతదేహాల అవశేషాలను గుర్తించినట్లు తెలిపారు. ఆ సమాధి కోకల్‌ సంస్కృతికి చెందిన ఉన్నత వర్గం ప్రభువుదిగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు.

అప్పటి ఆచారం ప్రకారం..ఉన్నత వర్గం ప్రభువు మరణిస్తే ఇలా ఈ 32 మందిని బలిచ్చి, విలువైన వస్తువులు, ఆభరణాలు పాతి పెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే ఆ వ్యక్తుల సంఖ్య ఎంత ఉండొచ్చనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు పురావస్తు శాఖ డైరెక్ట్‌ డాక్టర్‌ జూలియా. కాగా, సమాధిలో బయటపడ్డ నిధి అత్యంత విలువైనదని పనామా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లినెట్‌ మెంటోనెగ్రో చెబుతున్నారు. 

(చదవండి: ప్రపంచంలోనే తొలి బంగారు నౌక..ప్రయాణించాలంటే కోట్లు వెచ్చించాల్సిందే..!)


 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)