Breaking News

పచ్చని పల్లెలో మెచ్చే సర్పంచులు..!

Published on Wed, 01/29/2025 - 10:48

‘ఒక దేశ ఉజ్వల భవిష్యత్‌ ఆ దేశ గ్రామీణాభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది’ అనేది తిరుగులేని చారిత్రక సత్యం.పల్లెపచ్చగా కళ కళలాడాలంటే, ఆకలి డొక్కలతో పట్నానికి వలసపోకుండా ఉండాలంటే.. పల్లెతల్లిని కంటిపాపలా కాపాడుకోవాలి. ఈ మహిళా సర్పంచులు అదే పని చేశారు. గ్రామ ఆర్థికవృద్ధి నుంచి సర్వతోముఖాభివృద్ధి వరకు అంకితభావంతో పనిచేశారు. వారి సేవలకు గుర్తింపుగా ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడమే కాదు, అక్కడకు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ‘ఉత్తమ గ్రామ సర్పంచ్‌’ అవార్డ్‌ అందుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన వేదికపై ప్రసంగించారు.

ఘనత అనేది ‘నేను ఈ ఊరి సర్పంచు(Sarpanch)ని’ అని ఘనంగా చెప్పుకోవడంలో ఉండదు. సర్పంచుగా ఆ ఊరికి ఎలాంటి మంచి పనులు చేశారనేదే అసలు సిసలు ఘనత. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మేజర్‌ పంచాయతీల్లో ఒకటైన ఈడుపుగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పి.ఇందిర ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి పనులను చేపడుతోంది. సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే దిశగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది.

అర్హులకు సంక్షేమ పథకాలు అందించటం, హర్‌ఘర్‌ జల్‌ యోజన, మిషన్‌  ఇంద్రధనుష్, ప్రధాన మంత్రి జెన్‌  ఆరోగ్య యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, పీఎం మాతృవందన యోజన, పీఎం విశ్వకర్మ యోజన, పీఎం పోషణ యోజన, పీఎం ముద్ర యోజన, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సద్వినియోగంలో 90 శాతానికి పైగా ప్రగతి సాధించారు.

‘ఉత్తమ సర్పంచ్‌గా ఢిల్లీ(Delhi)లో రాష్ట్రప(President)తి సమక్షంలో అవార్డు అందుకోవడం, ప్రసంగించే అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నా బాధ్యతను రెట్టింపు చేసింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం దిశగా మరింత అంకితభావంతో పని చేస్తాను’ అంటోంది ఇందిర.

మా అమ్మ ఎప్పుడూ బాగుండాలి...
గ్రామ పంచాయతీలో లేబర్‌ కాంట్రాక్టరుగా, గుమస్తాగా పనిచేసిన తన భర్త అనుభవాన్ని కూడగట్టుకొని తన ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం లో విజయం సాధించింది ఎన్టీఆర్‌ జిల్లా, మైలవరం మండలం పొందుగల గ్రామ పంచాయతీ సర్పంచ్‌ గుగులోతు కోటమ్మ. ఉత్తమ గ్రామ సర్పంచ్‌గా ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ(Republic day) వేడుకలలో అవార్డ్‌ అందుకుంది. వేదిక ఎక్కి ప్రసంగించింది. 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, టాటాట్రస్టు సహకారం, జలజీవన్‌  మిషన్‌  నిధులు... ఇలా ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రూ.40 కోట్లతో గ్రామ అభివృద్ధి, సంక్షేమంపై ఖర్చు చేసింది. జలజీవన్‌ మిషన్‌లో భాగంగా రెండు వాటర్‌ ట్యాంకులు, ఇంటింటికి సురక్షితమైన నీటిని అందించేందుకు గ్రామంలో 350 ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేసింది. 

టాటా ట్రస్టు సహకారంతో ఐఓటీ సిస్టమ్‌ ఏర్పాటు చేసి నీటి సరఫరా లెక్కింపుతోపాటు క్లోరినేషన్‌ ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చేసిన మొదటి గ్రామంగా పొందుగలను నిలిపింది. నీటి వినియోగం, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తోంది. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ ఏర్పాటు, సేంద్రియ ఎరువుల తయారీలో విజయం సాధించింది. ‘ఊరు అంటే సొంత తల్లిలాంటిది. మా అమ్మ ఎప్పుడూ బాగుండాలి. అందుకోసం ఎంతైనా కష్టపడతాను’ అంటుంది గుగులోతు కోటమ్మ.
– ఇ.శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, వేమిరెడ్డి రామకృష్ణారెడ్డి, సాక్షి, జి.కొండూరు

కార్పొరేట్‌ వరల్డ్‌ నుంచి పల్లె ప్రపంచానికి...
ఎంబీఏ(MBA) చేసిన చేబ్రోలు లక్ష్మీమౌనిక మెడికల్‌ ట్రాన్స్‌స్క్రిప్షన్‌(Medical Transcription)  సంస్థలో ఉద్యోగం చేసింది. ఆ తరువాత పంచాయితీ ఎన్నికల బరిలోకి దిగి పదివేల జనాభా, నాలుగు శివారు గ్రామాలతో కూడిన కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి మేజర్‌ గ్రామపంచాయతీకి సర్పంచ్‌గా ఎన్నికయ్యింది. 

హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ ఏర్పాటు, గృహసముదాయాల పన్నుల ద్వారా గ్రామపంచాయతీ వార్షిక ఆదాయాన్ని రూ. 45 లక్షల నుంచి రూ. 2 కోట్లకు పెంచింది. గ్రామంలో పారిశుధ్య వ్యవస్ధను మరింత మెరుగు పరచడంతోపాటు సుమారు రూ. 2 కోట్లు వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, కొత్తగా తాగునీటి పైపులైన్లను ఏర్పాటు చేసింది. 

మహిళా ప్రజాప్రతినిధిగా ఆమె సేవలను గుర్తించిన పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులు దిల్లీలో జాతీయస్థాయిలో జరిగిన గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళికలపై జరిగిన వర్క్‌షాప్‌కు ఆంధ్రప్రదేశ్‌ నుండి లక్ష్మీమౌనికను ఎంపిక చేశారు. 

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన ఈ వర్క్‌షాపుకు హాజరైన లక్ష్మీమౌనిక తన అభిప్రాయాలను తెలియజేసింది. మైసూర్‌లో జరిగిన ‘పంచాయతీరాజ్‌ వ్యవస్థల్లో మహిళా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం’పై జరిగిన జాతీయ సదస్సుకు కూడా లక్ష్మీమౌనిక ఎంపికయింది.
– కొడాలి ప్రేమ్‌చంద్, సాక్షి, గన్నవరం 

(చదవండి: వందేళ్ల నాటి పైథానీ చీరలో బరోడా మహారాణి రాధికా రాజే..! అచ్చమైన బంగారంతో..)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)