Breaking News

తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారా..!?

Published on Tue, 02/03/2026 - 12:31

చాలామంది తరుచుగా ఉద్యోగాలు మారుతుంటారు. ముఖ్యంగా 20 నుంచి 25 ఏళ్ల వయసున్న యువత తరుచుగా జాబ్‌లు మారుతుంటారు. దాంతో చాలామంది ఈ ఉద్యోగంలోనైన ఎన్నాళ్లు ఉంటాడో అని విమర్శిస్తుంటారు. అయితే ఇలా విమర్శించడాన్ని తప్పుపడుతున్నారు పీపుల్‌ గ్రూప్‌ అండ్‌ షాదీ డాట్‌ కామ్‌ వ్యవస్థాపకుడు , సీఈవో అనుపమ్‌  మిట్లల్‌. ఇలా మారడాన్ని ఆయన సరైన స్ట్రాటజీగా అభివర్ణించారు కూడా. పైగా యువత సరిగ్గానే చేస్తుందని కితాబిచ్చేస్తున్నారు కూడా. చాలామంది నిపుణులు కూడా ఎక్కడ స్థిరంగా పనిచేయకపోతే అనుభవం ఎలా వస్తుందంటూ..ఉద్యోగాలు మారుతుండే వాళ్లని తిడుతుంటారు. కానీ మిట్టల్‌ మాత్రం ఇది సరైనదే అంటున్నారు. మరి అది ఏవిధంగానో ఆయన మాటల్లో సవివరంగా తెలుసుకుందామా..!

జెన్‌జెడ్‌ తరుచుగా ఉద్యోగాలను మార్చడంపై సీఈవో అనుమపమ్‌ మిట్టల్‌ సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ..ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. జెన్‌జెడ్‌ తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారని కెరీర్‌ నిపుణులు తప్పుపడుతుంటారు. కానీ దీన్ని డేటింగ్‌లా తీసుకోండి అంటున్నారు అనుపమ్‌. స్థిరంగా ఒక చోట ఉద్యోగం చేయడాన్ని వివాహంగా భావిస్తే..ఈ తరం యువత తమకు నచ్చిన రంగంలో అభిరుచి వెతుక్కుంటూ చేస్తున్న అన్వేషణే ఇది అని అంటున్నారాయన. 

ఇలా ఉద్యోగాలు మారుతు తమకు నచ్చిన రంగాన్ని వెతుక్కుంటున్నారని అన్నారు. ఈ యువ నిపుణుల తమకు ఏ రంగాలు, ఎందులో తాము సరిపోతామో అనేది తెలుసుకునే ‍ప్రయత్నంలో భాగమే ఇది అని అంటున్నారు. దీన్ని నమ్మకద్రోహం కిందకు చూడొద్దని, ఆత్మపరిశీలనకు సంబంధించిన అన్వేషణగా అభివర్ణించారాయన. చాలామంది కెరీర్‌ నిపుణులు దీన్ని తప్పుగా చూస్తున్నారు గానీ.. యువత సరిగ్గా చేయాల్సింది ఇదే కదా అన్నారు. 

నిజానికి జెన్‌జెడ్‌లో చాలామంది కెరీర్‌ ప్రారంభదశలో ఉన్న నిపుణులే. ఈ తరం ఒత్తిడి కంటే మానసిక శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇస్తోంది. పైగా వాళ్లు కార్పోరేట్‌ నిచ్చెన ఎక్కడం కంటే వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌పై దృష్టి పెడతారని పలు సర్వేలు కూడా పేర్కొన్నాయని గుర్తుచేశారు. అందువల్ల ఈ తరం చేస్తుంది ముమ్మాటికి కరెక్టేనని అన్నారు. 

అంతేగాదు 21-24 ఏళ్ల మధ్య ఉద్యోగాలు మారడం సరైనదేనని, 25 ఏళ్ల తర్వాత మాత్రం స్థిరంగా ఒకచోట పనిచేయాలని అనుపమ్‌ సూచించారు. అంతేగాదు ఉద్యోగం మారాక, దాని గురించి ఆలోచించకండి, చింతికండి అని చెబుతున్నారు అనుపమ్‌. తాను టీమ్‌ లీడర్‌గా ఉన్నప్పుడూ..ఉద్యోగాల నియామక ప్రక్రియలో చాలా క్లియర్‌గా ఉండేవాడినని, అభ్యర్థికి కనీసం 4 నుంచి 5 ఏళ్లు అనుభవం లేకపోతే నిర్థాక్షిణ్యంగా రిజెక్ట్‌ చేసేవాడినని అన్నారు. 

అలాగే ఇలా ఉద్యోగాలు మారడం వల్ల కొత్తదనం తెలియడమే కాకుండా, దాని పర్యవసానాలపై అవగాహన, అనుభవం ఏర్పడుతుందని కూడా నొక్కి చెప్పారు. ఈ పోస్ట్‌ చాలామంది యువతను ఆకర్షించడమే గాక మాకు ఇది సరైన మార్గనిర్దేశం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

(చదవండి: బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..! ఆ ఎనిమిది మార్పులు..)

 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)