Breaking News

జస్ట్‌ వాడిపడేసిన వాటితో అద్భుతమైన తోట..!

Published on Sun, 06/01/2025 - 15:40

వ్యర్థాలతో కళాత్మక వస్తువుల తయారీ గురించి మనకు తెలిసిందే! కేరళ వాసి అంజలి పవన్‌ అప్‌సైకిల్డ్‌ వ్యర్థాలతో తన ఇంటి ఆవరణలో ఓ తోటను ఏర్పాటు చేసింది. దానికి తన తల్లితో కలిసి వాడేసిన డబ్బాలు, సీసాలు, టైర్లు, పాత బట్టలు వంటి వ్యర్థాలను ఉపయోగించి, అప్‌సైక్లింగ్‌ చేయడం ద్వారా వాటి రూపు రేఖలనే మార్చేసింది.

తల్లీ కూతుళ్ల వినూత్న ప్రయోగం
‘‘మా అమ్మ ఫ్రెండ్‌ ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ జపనీస్‌ కళ కోకెడామా చూశాను. కోకెడామా అనేది జపనీస్‌ తోటపని పద్ధతి. ఇక్కడ మొక్కల వేళ్లను నాచుపట్టిన బంతిలో చుట్టి, వేలాడే తోటలను సృష్టిస్తారు. నేను కోకెడామాను చాలా ఇష్టపడ్డాను. సొంతంగా అలాంటి తోటను నేను సృష్టించుకోవాలనుకున్నాను. 

ఆన్‌లైన్‌లోను, యూట్యూబ్‌లోను శోధించిన తర్వాత, ఈ గార్డెన్‌ క్రియేషన్‌ను అమల్లో పెట్టాను. ఒకదాని నుంచి మరిన్ని మొక్కలను నాటడం ప్రారంభించాను. దీంతో మా తోట వికసించడం మొదలైంది. దానిని మరింత పెంచడానికి మరిన్ని కొత్త పద్ధతులను కనిపెట్టాం. పడేసే వస్తువులతో పర్యావరణ అనుకూలమైన ప్లాంటర్లుగా మార్చాను. దీనికి మా అమ్మ కూడా సాయం చేసింది. 

పెయింట్‌ డబ్బాలు, టైర్లు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి పొట్టు, ప్లాస్టిక్‌ సీసాలు, పాత కుట్టు మిషన్లు, డ్రమ్స్‌ వంటి వాటిని ఉపయోగించాం. ఇప్పుడు మా తోట మొత్తం వ్యర్థ పదార్థాలతో నిండి ఉంది. కానీ, అవి అత్యంత అందంగా మారిపోయాయి’’ అని చెబుతుంది అంజలి. మాక్రేమ్‌ ఆర్ట్‌ ఉపయోగించి వీరు ప్లాంట్‌ హ్యాంగర్లను కూడా తయారు చేశారు. అంజలి తల్లి పాత  దుస్తులను ఉపయోగించి, మొక్కల కుండీలను తయారు చేస్తుంది. 

వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా, ఈ తల్లీ కూతుళ్లు పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా మార్కెట్‌ నుంచి ప్లాంటర్లను కొనుగోలు చేయడానికి ఖర్చు చేసే డబ్బును కూడా ఆదా చేసే మార్గాన్ని కనిపెట్టారు. ఇప్పుడు వీరి ఇంటి ఆవరణ పచ్చదనంతో అత్యంత ఆహ్లాదంగా మారిపోయింది. 
ఎన్‌.ఆర్‌ 

(చదవండి: Jamai Sasthi: కొత్త అల్లుడికి కొసరి..కొసరి..)

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)