Breaking News

Ananya Tripathi: కోడర్‌ టు రియల్‌ ఎస్టేట్‌ క్వీన్‌

Published on Tue, 03/26/2024 - 06:24

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మహిళల పేర్లు అరుదుగా వినిపిస్తాయి. కోడర్, స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్, సీయీవోగా మంచి పేరు తెచ్చుకున్న 39 సంవత్సరాల అనన్య త్రిపాఠి రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగు పెట్టి విజయం సాధించింది. ‘రియల్‌ ఎస్టేట్‌ క్వీన్‌’గా పేరు తెచ్చుకుంది...

ఆర్మీ ఆఫీసర్‌ కూతురు అయిన అనన్య త్రిపాఠి తరచుగా ఒక స్కూల్‌ నుంచి మరో స్కూల్‌కు మారుతూ ఉండేది. ‘రకరకాల ప్రాంతాలలో చదువుకోవడం వల్ల ఎన్నో సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం, అదృష్టం దొరికింది’  అంటుంది అనన్య.

పుణెలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్‌ పూర్తిగా చేసిన అనన్య ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ కంపెనీ ‘టీసీఎస్‌’ తొలి ఉద్యోగం చేసింది.
కోడర్‌గా మంచి పేరు వచ్చినా తన దృష్టి వ్యాపారంగంపై మళ్లింది. అలా కోళికోద్‌ – ఐఐఎంలో ఎంబీఏ చేసింది. క్యాంపస్‌ సెలెక్షన్‌లో ‘మెకిన్సీ’కి ఎంపికైన ఏకైక స్టూడెంట్‌ అనన్య.

గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ ‘మెకిన్సీ’లో  ఏడు సంవత్సరాల ప్రయాణం తనకు ఎన్నో పాఠాలు నేర్పింది.
మార్గదర్శకులలాంటి వ్యక్తులతో పరిచయం జరిగింది.

విశ్లేషణాత్మకంగా ఉండడంతో పాటు స్ట్రక్చర్డ్‌ డాటా తాలూకు సమస్యలను పరిష్కారించడానికి సంబంధించిన జ్ఞానాన్ని మెకిన్సీలో సొంతం చేసుకుంది. అయితే ఫ్యాషన్‌ ఇ–కామర్స్‌ కంపెనీ ‘మింత్రా’ నుంచి వచ్చిన అవకాశం అనన్య కెరీర్‌ను మార్చి వేసింది. ఇ–కామర్స్‌ గురించి ఎన్నో సందేహాలు ఉన్న ఆ కాలంలో ‘మింత్రా’ నుంచి వచ్చిన ఆఫర్‌కు వెంటనే ఓకే చెప్పడం కష్టమే. అయినప్పటికీ సందేహాలను పక్కన పెట్టి చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ హోదాలో ‘మింత్రా’లో  చేరింది అనన్య. మూడున్నరేళ్లలో ‘మింత్రా’ లాభాలను పెంచింది.

 ఆ తరువాత గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫర్మ్‌  ‘కేకేఆర్‌ కేప్‌స్టోన్‌’ నుంచి కొత్త కెరీర్‌ ఆపర్చునిటీ వెదుక్కుంటూ వచ్చింది. ‘కేకేఆర్‌’లో మాక్స్‌ హెల్త్‌కేర్, వినీ కాస్మెటిక్స్‌లాంటి కంపెనీలతో కలిసి పనిచేసింది. అనన్య మెటర్నిటీ లీవ్‌లో ఉన్నప్పుడు రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌ ‘బ్రూక్‌ఫీల్డ్‌’ నుండి పిలుపు వచ్చింది. మామూలుగానైతే మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్నప్పుడు సెలవు కాలం పూర్తయ్యేంత వరకు చాలా కంపెనీలు వేచి  చూడవు. అయితే బ్రూక్‌ఫీల్డ్‌ మాత్రం అనన్య ప్రతిభాసామర్థ్యాలపై నమ్మకంతో ఓపిగ్గా వేచి చూసింది.
వారి నమ్మకాన్ని అనన్య వమ్ము చేయలేదు.

‘పలు పరిశ్రమలకు సంబంధించి ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రాజెక్ట్‌లలో అనన్యకు అపారమైన అనుభవం ఉంది. స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌గా ఆమె ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది’ అంటాడు బ్రూక్‌ఫీల్డ్‌ రియల్‌ ఎస్టేట్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ అంకుర్‌ గుప్తా.
బ్రూక్‌ఫీల్డ్‌ రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మరోసారి గెలుపు జెండా ఎగరేసిన అనన్య త్రిపాఠి నుంచి వినిపించే సక్సెస్‌మంత్రా ‘కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటికి రావాలి’.        
 

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)