Breaking News

సాటి లేరెవరూ  నీ సాహసానికి!

Published on Sat, 02/08/2025 - 04:15

బెంగళూరుకు చెందిన అనన్య ప్రసాద్‌ అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా ఒంటరి ప్రయాణం చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. స్పానిష్‌ కానరీ దీవుల్లోని లా గోమెరా నుంచి 52 రోజుల్లో కరీబియన్‌ దీవుల్లోని ఆంటిగ్వాకు చేరుకుంది. 52 రోజుల్లో 3,000 మైళ్ల చారిత్రాత్మక యాత్రను ముగించింది. అనన్య ప్రముఖ కన్నడ కవి జీఎస్‌ శివరుద్రప్ప మనవరాలు.

బెంగుళూరులో పుట్టిన అనన్య పెరిగింది, చదువుకున్నదీ యూకేలో. సరదాగా మొదలైన రోయింగ్‌ హాబీ ఆ తరువాత అంకితభావంతో కూడిన పాషన్‌గా మారింది.
‘రోయింగ్‌ను వ్యాయామంగా ఆస్వాదిస్తాను. రోయింగ్‌ అనేది నా దృష్టిలో సాహసం’  అంటుంది అనన్య.

వరల్డ్స్‌ టఫెస్ట్‌ రో’లో అన్ని వయసులు, అన్ని దేశాల వారు పాల్గొంటారు. ఈ రేసుకు అర్హత సాధించడానికి మూడున్నరేళ్లు శిక్షణ తీసుకుంది అనన్య. శిక్షణలో మానసిక, శారీరక ఫిట్‌నెస్, సాంకేతిక నైపుణ్యంపై పట్టు సాధించింది.
తన యాత్రలో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడంలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొంది. ప్రతిరోజు 60 నుంచి 70 కిలోమీటర్‌లు ప్రయాణించేది. రోజుకు 5 నుంచి 6 గంటలు మాత్రం విశ్రాంతికి కేటాయించేది. 

‘ఒంటరిగా ఉన్నప్పటికీ నాకు ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. వాతావరణ, సాంకేతిక నిపుణులు, సోషల్‌ మీడియా బృందాలతో ఎప్పుడూ టచ్‌లోనే ఉన్నాను’ అని తన ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకుంది అనన్య.తన సాహసానికి సామాజిక ప్రయోజనాన్ని కూడా జత చేసింది. మన దేశంలోని అనాథ పిల్లలకు ఆసరాగా నిలిచే మెంటల్‌ హెల్త్‌ ఫౌండేషన్, దీనబంధు ట్రస్ట్‌ అనే స్వచ్ఛంద సంస్థల కోసం విరాళాలు సేకరించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)