Breaking News

అంతరించిపోయిన ఐకానిక్‌ పక్షులకోసం అనంత్‌ అంబానీ కీలక నిర్ణయం

Published on Thu, 01/30/2025 - 18:22

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ  చిన్న కుమారుడు అనంత్‌ అంబానీకి చెందిన వంతారా వన్య ప్రాణుల సంరక్షణలో  మరో కీలక అడుగు వేసింది. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణను అభివృద్ధి చేయడంలో  కృషి  చేస్తున్న  వంతారా  బ్రెజిల్‌లో   దాదాపు అంతరించి పోయినట్టు ప్రకటించిన ఐకానిక్‌  పక్షులను రక్షించేందుకు నడుంబిగించింది. బ్రెజిల్‌లోని కాటింగా బయోమ్‌ అడవిలో అంతరించిపోయిన 41  స్పిక్స్ మకావ్‌ (Cyanopsitta spixii) లకు పునరుజ్జీవం తెచ్చేందుకు రంగంలోకి దిగింది.  ఇందుకు సంబంధించి వంతారా అనుబంధ సంస్థ గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), అసోసియేషన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ థ్రెటెండ్‌ పేరెట్స్‌  (ACTP)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

2000లో  అంతరించిపోయినట్లు ప్రకటించినన స్పిక్స్ మాకా (సైనోప్సిట్టా స్పిక్సీ) అనే జాతిని పునరుద్ధరించే ప్రయాణంలో ఈ ఐకానిక్ పక్షులను బ్రెజిల్‌లోని వాటి స్థానిక ఆవాసాలకు తిరిగి పరిచయం చేయడమే ఈ చొరవ లక్ష్యం. ఇందులో  GZRRC  ప్రాజెక్ట్‌లో విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

జర్మనీలోని బెర్లిన్‌లోని ఏసీటీపీ బ్రీడింగ్ సెంటర్ నుండి 41 స్పిక్స్ మకావ్‌లను బ్రెజిల్‌లోని బాహియాలోని విడుదల కేంద్రానికి విజయవంతంగా తరలించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని సాధించిందిఅనంత్ అంబానీ నేతృత్వంలోని  వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ వంతారా. ఈ గ్లోబల్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా, వంతారా  నిపుణులు ఏసీటీపికి మార్గదర్శకత్వం చేయడంతో పాటు కీలకమైన వనరులను అందిస్తారు. వీటిల్లో 2022లో 20 స్పిక్స్ మకావ్‌లను అడవిలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరిగిందని, దీని ఫలితంగా 20 సంవత్సరాలలో తొలిసారి పిల్లలు పుటాయనీ,  ఇది ప్రోగ్రామ్ పురోగతికి సామర్థ్యానికి నిదర్శనమని వంతారా ప్రకటించింది.

బ్రెజిల్‌కు బదిలీకి ఎంపిక చేయబడిన 41 స్పిక్స్ మకావ్‌లను వాటి వంశపారంపర్యత, ఆరోగ్యం ఆధారంగా ఎంపిక చేశారు.  ఇందులో 23 ఆడ, 15 మగ, 3 ఇంకా నిర్ధారించని చిన్న పిల్లలున్నాయి. ఈ సంవత్సరం విడుదలకు సిద్ధమవుతున్న బృందంలో కొన్ని చేరగా, మరికొన్ని దీర్ఘకాలిక పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతుగా బ్రీడింగ్ ప్రోగ్రామ్‌లో చేర్చారు.. బదిలీకి ముందు, పక్షులు బెర్లిన్‌లోని ఒక బ్రీడింగ్ ఫెసిలిటీలో 28 రోజుల కంటే ఎక్కువ క్వారంటైన్‌లో ఉన్నాయి. అక్కడి అడవి పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఏవైనా వ్యాధులకు లేవని నిర్దారించుకునేందుకు వీలుగా  సమగ్ర పరీక్షలు నిర్వహించారు. జనవరి 28న, ఆ పక్షులు బెర్లిన్ నుండి చార్టర్డ్ విమానంలో బ్రెజిల్‌లోని పెట్రోలినా విమానాశ్రయానికి బయలు దేరి, అక్కడికి చేరుకున్న తర్వాత, వాటిని నేరుగా క్వారంటైన్ సౌకర్యానికి తరలించారు. ఈ బదిలీని ఇద్దరు పశువైద్యులు , ఏసీటీపిఒక కీపర్ జాగ్రత్తగా పర్యవేక్షించారు, వీరితో పాటు వంటారా  GZRRC నుండి నిపుణుల బృందం కూడా ఉంది.

స్పిక్స్  మకావ్స్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్‌కు వారి అద్భుతమైన  కృషి చేసిన అనంత్ అంబానీ , వంతారాబృందానికి ACTP వ్యవస్థాపకుడు మార్టిన్ గుత్  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతరించిపోయిన జాతుల రక్షణలోఆర్థిక సహాయంతో పాటు, నైపుణ్యం ఎంతో అమూల్యమైనదని  కొనియాడారు.

హాలీవుడ్ చిత్రం రియోలో ప్రముఖంగా కనిపించిన స్పిక్స్ మకా, బ్రెజిలియన్ ప్రభుత్వం కృషి చేస్తోంది.  ఇందులో భాగంగా 2019లో, బ్రెజిల్‌లో ఒక ప్రత్యేక విడుదల కేంద్రం స్థాపించారు. ఆ తర్వాత 2020లో జర్మనీ  బెల్జియం నుండి 52 పక్షులను రవాణా చేశారు. 2022లో, 20 స్పిక్స్ మకావ్‌లను వాటి సహజ ఆవాసాలలోకి విడుదల  చేయగా, ఏడు అడవి కోడిపిల్లలు జన్మించాయి. భారతదేశ వైవిధ్యమైన వన్యప్రాణుల వారసత్వాన్ని పునరుద్ధరించడానికి కూడా వంతారా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కట్టడిలో ఉన్న ఖడ్గమృగాలను సురక్షితమైన ఆవాసాలలోకి తిరిగి ప్రవేశపెట్టడం, సంతానోత్పత్తి , ఆవాస పునరుద్ధరణ ద్వారా ఆసియా సింహాల జనాభాను బలోపేతం చేయడం వాటి సంతానోత్పత్తి కార్యక్రమం తర్వాత చిరుతలను భారతీయ అడవులకు తిరిగి తీసుకురావడం వంటివి ఉన్న సంగతి తెలిసిందే.

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు