Breaking News

అనంత్‌ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్‌ : మరో విశేష కార్యక్రమం, వైరల్‌ వీడియో

Published on Tue, 07/02/2024 - 17:35

రిలయన్స్‌ అధినేత, కుబేరుడు ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ దంపతులు తమ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా  మరో విశిష్ట కార్యక్రమాన్ని  నిర్వహించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన జంటల సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు అంబానీ దంపతులు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విశేషంగా నిలిచింది. 

ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ దగ్గరుండి మరీ  ఈ  కార్యక్రమాన్నినిర్వహించారు. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్ఘర్‌కు చెందిన 50 మంది నిరుపేద జంటకు సామూహిక వివాహాలను నిర్వహించారు. 

అలాగే అంబానీ పెద్దకుమారుడు ఆకాశ్‌ అంబానీ, ఆయన భార్య శ్లోకా, ఇషా అంబానీ, భర్త ఆనంద్‌ పిరామిల్‌ కూడా పాల్గొన్నారు. శ్లోకా అంబానీ నూతన వధూవరులకు  ఖరీదైన బహుమతులను అందించారు. 

కాగా జూలై 12న ముంబైలోని బాంద్రాలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో  అనంత్‌, రాధిక మర్చంట్ వివాహం వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యినట్టు తెలుస్తోంది.  వీరి  పెళ్లికి సంబంధించిన తొలి వివాహ ఆహ్వాన పత్రికను ఇటీవలే   నీతా అంబానీ వారణాసిలోని కాశీ విశ్వనాథుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యే  అవకాశముందని అంచనా.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)