Breaking News

ఆషాడ మాసంలో అనంత్‌ అంబానీ పెళ్లి..కారణం ఇదే..!

Published on Sun, 07/14/2024 - 13:40

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ -రాధికల వివాహం శుక్రవారం జియో కన్వెన్షన్‌ సెంటర్‌లో అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ పెళ్లి సందడికి సంబంధించిన ప్రతి విషయం నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. అత్యంత లగ్జరీయస్‌గా జరిగిన ఈ వివాహానికి సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు, రాజకీయనాయకులు హాజరయ్యారు. 

అయితే ప్రస్తుతం నెట్టింట ముఖేశ్‌ అంబానీ ఇంట జరిగిన ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఆషాడంలో పెళ్లిళ్లు చెయ్యరు. అందులోనూ కొత్త కోడలు అత్తారింట ఉండనే ఉండకూదు. అసలు ఈ మాసం మూఢంతో సమానమని. ఎలాంటి వివాహ తంతు లేదా అందుకు సంబంధించిన ఏ పనులు చెయ్యరు. మరీ అలాంటిది ముఖేశ్‌ ఉండి ఉండి మరీ ఇలా ఆషాడంలో పెళ్లి చేయడం ఏంటనీ సర్వత్రా చర్చించుకుంటున్నారు. 

కారణం ఏంటంటే..
ఇక్కడ అనంత్‌ రాధికల పెళ్లి ముహుర్తం ధృక్‌ గణితం ఆధారంగా ముహర్తం నిర్ణయించారు పండితులు. దీన్ని సూర్యమానం ప్రకారం నిర్ణయిస్తారు. వాస్తవానికి దక్షిణాది వారు చాంద్రమానం ప్రకారం ముహుర్తాలు నిర్ణయించగా..ఉత్తరాది వారు సూర్యమానం ఆధారంగా పంచాంగం నిర్ణయిస్తారు. అలాగే చాంద్రమాన పంచాగంలో ఉన్నట్లు అధిక మాసాలు అంటూ..ఈ సూర్యమాన పంచాంగంలో ఉండనే ఉండవు. పైగా ఆయా ప్రాంతాల వారీగా అది ఆషాడ మాసం కాదు. 

ఇక అనంత్‌ రాధికల పెళ్లి జూలై 12 శుక్రవారం మేషరాశిలో చంద్రుడు సంచారం, సూర్యుడు ఉత్తరదిశగా ప్రయాణిస్తుంటాడు చంద్రుడు రాత్రి వృషభరాశిలో ‍సంచారం. పైగా ఇది పమరమిత్ర తార కలిగిన శుభఘడియలు కూడా. కావున పండితులు ఈ ముహర్తం వివాహానికి అత్యంత శుభప్రదమని చెబుతున్నారు. అందువల్లే ఆషాడంలో కూడా అంబానీ ఇంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అనంత​ రాధికల వివాహం జూలై 12 శుభ్‌ వివాహ్‌తో మొదలయ్యి..జూలై 13 శుభ్‌ ఆశీర్వాద్‌, జూలై 14న మంగళ మహోత్సవంతో ముగుస్తాయి. 

(చదవండి: వందేళ్లక్రితమే భారత్‌లో సెల్ఫీ ఉందని తెలుసా..!)
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు