Breaking News

అనంత్-రాధిక హల్దీ.. వెలుగులోకి మరో వీడియో! వైరల్‌

Published on Mon, 12/16/2024 - 14:26

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ రాధికల పెళ్లి ఎంతలా అంగరంగ వైభవంగా జరిగిందో తెలిసిందే. ఆ వేడుకకు సంబంధించిన ప్రతి ఫోటో, వీడియోలు నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అంబానీలు ధరించే కాస్ట్యూమ్స్‌, నగలు, తదితరాలు చాలా హాట్‌టాపిక్‌గా నిలిచాయి కూడా. అయితే ఆ వేడుకకు సంబంధించి ఓ వీడియోని మాత్రం అందరూ మిస్‌ అయ్యాం. సరదసరదాగా సాగే హల్దీ వేడుకకు సంబంధిచిన మరో వీడియో తాజగానెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

అంబానీలకు సన్నిహితుడైన అకా ఓర్హాన్ అవత్రమణి షేర్‌ చేసిన ఈ లేటెస్ట్‌ ​వీడియోలో అంబానీలంతా ఖుషీగా గడిపినట్లు కనిపించింది. అతిధులంతా పసుపునీళ్లు ఒకరిపై ఒకరూ వేసుకుంటూ సందడి చేశారు. ఆ వీడియోలో నీతా అంబానీ పసుపు నీళ్లు పడకుండా తప్పించుకోవడంలో విఫల ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వేడుకకు హోస్ట్‌గా ఉన్న నీతా అంబానీ సైతం అంరిలానే హల్దీ దాడిని ఎదుర్కోవడం ఫన్నీగా ఉంటుంది. ఇ

క అనంత్‌ అంబానీ బావమరిది ఆనంద్‌ పిరమల్‌​ ఒకరిపై ఒకరు పసుపు నీళ్లు, పూలతో దాడి చేయడం, మరోపక్క అతిథులంతా నవ్వుతూ ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఈ హల్దీ ఫంక్షన్‌ ముంబైలోని అంబానీ కుటుంబానికి చెందిన ఆంటిలియాలో జరిగింది. 

ఈ వేడుకలో జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, రణ్‌వీర్ సింగ్ తదితర తారలు పాల్గొన్నారు. అంతేగాదు ఈ లెటెస్ట్‌ ఓర్రీ వీడియోలో ధోల్ బీట్‌లు,  డ్యాన్స్‌లతో ఇతర అతిథులు ఎంత సరదాగా గడిపారో కూడా కనిపిస్తోంది. కాగా, అనంత్‌ రాధిక మర్చంట్‌ల వివాహం ఈ ఏడాది జూలై 12న అత్యంత లగ్జరియస్‌గా జరిగింది. 

(చదవండి: అందమైన శరీరాకృతికి బీబీఎల్‌ సర్జరీ: అంటే ఏంటీ..? ఎదురయ్యే దుష్ర్పభావాలు..)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)