Breaking News

ఆ చిన్నారి గురువుకు మించిన శిష్యురాలు..! ఆనంద్‌ మహీంద్రా ప్రశంసల జల్లు..

Published on Sun, 11/16/2025 - 15:50

పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ఎప్పటికప్పుడు స్ఫూర్తిదాయకమైన వీడియోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అలానే ఈసారి గురువు గొప్పతనాన్ని ఆవిష్కరించే వీడియోతో మన ముందుకొచ్చారు. ముందుండి గొప్పగా నడిపించే గురువు ఉంటే ఏ విద్యార్థి అయినా మహనీయుడు(రాలు) అవుతాడంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. 

మహీంద్రా ఆ వీడియోలో ఉపాధ్యాయులు విద్యార్థిలోని ప్రతిభను ఎలా సానపెట్టి బయటకు తీసుకోస్తారో వివరించే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో ఒక చిన్నారి తన గురువుని అనుకరిస్తూ..అత్యంత అద్భుతంగా అభినయిస్తూ చేసిన డ్యాన్స్ అందరీ మనసులను దోచుకుంది. వావ్‌ ఏం బాగా చేసింది అనేలా..అత్యద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది. తన గురువు తోపాటు కాలు కదిపిన ఆ చిన్నారి స్టెప్పులకు కళ్లు ఆర్పడమే మర్చిపోయేలా చేస్తుంది. 

ఇంత అద్భుతంగా ఆ చిన్నారిని తీర్చిదిద్దిన ఆ గురువు ముందుగా ప్రశంసనీయడు అని మెచ్చుకున్నారు మహీంద్రా. ఉపాధ్యాయుడి శక్తిమంతమైన ప్రమేయం..విద్యార్థిని ఉన్నతంగా మార్చగలదు అనేందుకు ఈ వీడియోనే ఉదాహరణ అని అన్నారు. విద్యార్థి ఆత్మవిశ్వాసంతో కనబర్చే ప్రతిభ..అతడి గురువు గైడెన్స్‌ ఏవిధంగా ఉందనేది చెప్పకనే చెబుతుందన్నారు. 

నిజమైన గురువులు చేతలతోనే గొప్పవాళ్లుగా తీర్చిదిద్దుతారు..వాళ్ల వల్లే అభివృద్ధి చెందాలనే కోరిక బలీయమవుతుందని అన్నారు. ప్రతి విద్యార్థికి అద్బుతంగా రాణించేలా చేసే ఉపాధ్యాయుల ఆశీర్వాదం లభిస్తే..వాళ్లకు మించిన అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అంటూ గురువు విశిష్టతను నొక్కి చెప్పారు మహీంద్రా.

 

(చదవండి: 1996లో బ్యాంక్‌ పాస్‌ బుక్‌ అలా ఉండేదా..! ఆ రోజుల్లోనే..)
 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)