Breaking News

తల్లికి జరిగిన అన్యాయమే ఐఏఎస్‌ అధికారిగా మార్చింది..ఆనంద్‌ మహీంద్రా మెచ్చిన స్టోరీ..

Published on Fri, 03/14/2025 - 14:37

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను సోషల్‌ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువతను ప్రేరేపించే మంచి స్ఫూర్తిదాయక స్టోరీలు షేర్‌ చేసుకుంటుంటారు. అలానే ఈసారి ఆయన మనసుకు బాగా హత్తుకున్న స్పూర్తిదాయకమైన మరొక గాథను పంచుకున్నారు. తల్లికి జరిగిన అన్యాయమే కొడుకుని ప్రతిష్టాత్మక యూపీఎస్సీ ఎగ్జామ్‌ని చేధించేందుకు దారితీసింది. ప్రపంచముందు ఓ హీరోలో నిలిచేందుకు కారణమైంది. విమర్శలతో సాగిన జీవితం బాధతో ఆగిపోకూడదనే చెప్పే ఈ స్టోరీ అందరి మనసులను కదిలిస్తుందంటూ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఆ సక్సస్‌ స్టోరీ ఎవరిదంటే...

రాజస్థాన్‌కి చెందిన హేమంత్‌ స్టోరీనే ఇది. అతడి తల్లి దినసరి కూలీ. అయితే సాధారణంగా కూలీకి ఇచ్చే రూ. 200 వేతనం కంటే తక్కువే ఆమె పొందడంతో బాధపడి ఇదేంటని కాంట్రాక్టర్లని నిలదీశాడు హేమంత్‌. వాళ్లంతా ఎగతాళి చేస్తూ.చాలా అవమానకరంగా మాట్లాడారు. అదే హేమంత్‌లో కసిని పెంచి ఐఏఎస్‌ అవ్వాలనే ఆకాంక్షను రగిల్చింది. 

అందుకు అతడి వద్ద కనీస వనరులేవి లేవు. ఇంట్లో ఆదాయం అంతంతమాత్రమే. తన లక్ష్యం ఇది అని చెబితే..అంతా సాధ్యం కాదని నిరాశపరిచినవాళ్లే. పైగా కాస్త డబ్బున్న వాళ్లు కోచింగ్‌లు తీసుకుని సాధించగలరని నిరుత్సాహాపరిచడమే అడగడుగునా..అయినా అవేం పట్టించుకోలేదు. కేవలం జేబులో రూ. 1400లతో ఢిల్లీ వెళ్లిపోయాడు. అక్కడ ఎక్కడ చదువుకోవాలో తెలియదు. మార్గదర్శకత్వం చేసేవాళ్లు లేరు. 

కేవలం ఎలాగైన ఐఏఎస్‌ అధికారి కావాలన్న తపన మాత్రమే ఉంది. అదే అతడిని తనలాంటి వాళ్లకు ఆశ్రయం ఇచ్చే చోటుకి చేర్చింది. అలా LBSNAA (లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్)లో శిక్షణ తీసుకుని మరీ ఆల్‌ఇండియా ర్యాంక్‌ 884 సాధించాడు. దివ్యాంగుల కోటలో సాధించాల్సిన ర్యాంకుని అందుకుని ఐఏఎస్‌ అయ్యాడు. ఇక్కడ హేమంత్‌కి శారీరకంగా, ధనం పరంగా అసమానతలు ఉన్నాయి. 

నిజానికి సాధించగలిగేంత చిన్న లక్ష్యం కాదు ఐఏఎస్‌ అంటే. ఆ విషయం హేమంత్‌కి కూడా తెలుసు. అయితే హేమంత్‌ ఎదుర్కొన్న విమర్శలు అతడిని లక్ష్యం సాధించేలా కసి పెంచాయి. అందువల్లే అతడు తన లక్ష్యం అనితరసాధ్యమైనదని ఎందరన్నా..తన గమ్యం వైపే అడుగులు వేశాడు. ప్రతికూలతలు, అవమానాలకు ప్రతిస్పందన మనం సాధించే విజయమే అని చాటి చెప్పాడు. 

అంతేగాదు మనం అందుకున్న ఘన విజయం విమర్శకుల నోటికి తాళం పడేలా చేస్తుందని చేతల్లో చేసి చూపించాడు హేమంత్‌. ప్రతిఒక్కరూ తమ కెరీర్‌లో ఎక్కడో ఒక చోట ఇలాంటి అవమానాలు, చులకనభావం వంటివి ఎదుర్కొనే ఉంటారు. వాటికి ప్రతిస్పందించి శక్తిని వృద్ధా చేసుకునే కంటే..మన అభ్యున్నతిపై దృష్టిపెట్టి ఊహించని విజయం అందుకుంటే అదే వారికి గొడ్డలిపెట్టు అని పోస్ట్‌లో హైలెట్‌ చేసి చెప్పారు ఆనంద్‌ మహీంద్రా. నెటిజన్లు కూడా ప్రతికూలతలకు మన విజయంతోనే గట్టి సమాధానం చెప్పాలంటూ ఆయనకు మద్దతుగా పోస్టులు పెట్టారు.



--

(చదవండి: ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే..! హెచ్చరిస్తున్న న్యూట్రిషన్లు)

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)