Breaking News

ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్‌బీకి కూడా నచ్చవట..

Published on Mon, 06/02/2025 - 17:20

కొన్ని రకాల కూరగాయలు అందరు ఇష్టపడరు. దాని రుచి రీత్యా తినేందుకు మక్కువ చూపించరు. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఓ షోలో తనకు కూడా కొన్ని కూరగాయలు నచ్చవని చెప్పారు. పైగా ఆయన చాలా చమత్కారంగా ఆ కూరగాయలను తినదగినవి కావు..కానీ తింటేనే ఆరోగ్యం అని అన్నారు. మరీ బిగ్‌ బీ సైతం ఇష్టపడి ఆ కూరగాయాలు ఏవి..?. వాటివల్ల కలిగే లాభాలేంటి తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తనకు కూడా కొన్ని కూరగాయలంటే అస్సలు ఇష్టం ఉండదని అన్నారు. అవేంటో షేర్‌ చేసుకున్నారు కూడా. అయితే వాటిని అందరూ తప్పక తీసుకోవాల్సిందేనని, ఆరోగ్యంగా ఉండాలంటే తప్పదు మరీ అని నవ్వేశారు. ఆ కూరగాయలే పనస, గుమ్మడి  కాయ, కాకరకాయ. 

పనస: 

దీన్ని కూరగానూ, పండుగానూ కూడా తీసుకుంటారు. ఇందులో పోటాషియం సమృద్ధిగా ఉంటుందట. గుండె కండరాలతో సహా మొత్తం కండరాల పనితీరుని నిర్వహించడంలో కీలకంగా ఉంటుంది. 

అంతేగాదు శరీరంలోని సోడియం నియంత్రణను నిర్థారిస్తుంది. 

అలాగే ఆర్థరైటిస్ ఆస్టియోపోరోసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. 

ఇందులో ఎముకలకు అవసరమైన కాల్షియం కూడా అధికంగా ఉంటుందట. ఐరన్‌ మూలం కూడా.

ముఖ్యంగా రక్తహీనతతో పోరాడటానికి, జీవక్రియను పెంచడానికి ఉపకరిస్తుందట. 

ఇందులో మెగ్నీషియం, విటమిన్‌ సీ, రాగి వంటివి కూడా ఉంటాయట. ఇవి రక్త నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు.

గుమ్మడికాయ
గుమ్మడికాయలలో కేలరీలు తక్కువ, పోషకాలు పుష్కలం, ఇందులో విటమిన్‌ ఏ, సీ, పొటాషియం, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయట. 

ఇది బీటా-కెరోటిన్కి అద్భుతమైన మూలం. 

కొల్లాజెన్‌ ఉత్పత్తికి మద్దతిస్తుంది. 

పొటాషియం, సోడియం ప్రభావాలను సమతుల్యం చేసి రక్తపోటుని నియంత్రిస్తుంది. 

ఇది బరువు తగ్గాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఆహారం కూడా. దీనిలో ఉండే అధిక ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. 

అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుందట.  

కాకరకాయ

ఇందులో విటమిన్‌ ఏ,సీలు, ఫోలేట్‌, పొటాషియం, ఐరన్‌ తదితర కీలకమైన పోషకాలు ఉంటాయి. 

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలోనూ, మధుమేహ నిర్వహణలో సహాయపడుతుంది. 

దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. 

ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది., ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్‌లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.

అలాగే ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేలా చేసి కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందేలా చేస్తుంది. 

ఇందులో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ ఫైబర్ అధికంగా ఉంటుంది, సంతృప్తిని ప్రోత్సహించి, బరువుని అదుపులో ఉంచుతుంది. 

దాంతోపాటు కాలేయ పనితీరుకు మద్దతు ఇచ్చి..శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులను లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: చప్పట్లు కొడితే శబ్దం ఎందుకొస్తుందో తెలుసా..? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు)

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)