Breaking News

'అమేయ డబ్లి' పాన్‌ ఇండియా టూర్‌.

Published on Fri, 06/27/2025 - 10:06

ప్రముఖ పాన్‌ ఇండియా సింగర్‌ అమేయ డబ్లి తన స్వర మాధుర్యంతో నగరంలో సందడి చేయనున్నారు. గత 14 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా సంగీత కచేరీలు, ప్రదర్శనలు చేసిన అమేయ డబ్లి ఈ నెల 28న నగరంలోని శిల్పకళావేదికగా లైవ్‌ కాన్సర్ట్‌తో సంగీత ప్రియులను అలరించనున్నారు. ఏకమ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘పాన్‌ ఇండియా కృష్ణా టూర్‌’లో భాగంగా హైదరాబాద్‌తో పాటు భారత్‌లోని 11 నగరాల్లో ఈ కాన్సర్ట్‌ నిర్వహించనున్నారు. ఈ మ్యూజికల్‌ టూర్‌ కృష్ణునిపై మాత్రమే సంగీత విభావరి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇటీవల సన్నాహక కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో ‘సాక్షి’తో ముచ్చటించారు.. ఆ విశేషాలు.. 

టాలీవుడ్‌ స్టార్‌ రాణా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ పెళ్లి మొదలు కపూర్‌ ఖండన్, రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా, జిందాల్‌ కుటుంబం, ఇమామి గ్రూప్‌లోని అగర్వాల్‌ కుటుంబం, ఇషా అంబానీ, ఆనంద్‌ పిరమల్‌ వంటి లగ్జరీ వేడుకల్లో పాడిన డబ్లి మొదటి సారి నగరంలో సంగీత ప్రదర్శన చేపట్టడం విశేషం. 

ఏకమ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో.. 
సంగీతం ఒక సాంత్వన, పాటలు ఒక సంతృప్తి..!! నా ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా ప్రదర్శనలిచ్చాను. ఈ సారి వినూత్నంగా కృష్ణుని ఇతివృత్తంతో ఈ పాన్‌ ఇండియా టూర్‌ చేయడం సంతోషంగా ఉంది. 

ముఖ్యంగా నా సామాజిక బాధ్యతగా నా సంపాదనలో 25 నుంచి 50 శాతం వరకూ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటాను. ఇందులో భాగంగానే ఏకమ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ మ్యూజికల్‌ టూర్‌ను జైపూర్, జోద్‌పూర్, సూరత్, ముంబై, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల్లో ప్రదర్శిస్తున్నాను.  

ప్రదర్శనలో 25 శాతం వారికే.. 
దేశం కోసం నిరంతరం పోరాడుతున్న ఆర్మీ కోసం ప్రత్యేకంగా సంగీత ప్రదర్శనలిచ్చాను. అంతేకాకుండా నా ప్రతి ప్రదర్శనలో 25 శాతం సీట్లు ఆర్మీ వారి కోసం ఉచితంగా కేటాయిస్తాను.. ఈ ఆనవాయితి నగరంలోని ప్రదర్శనలో కూడా కొనసాగుతోంది. ఈ ప్రదర్శన కోసం మొదటిసారి తెలుగు పాటను కూడా పాడబోతున్నా. 

అనాది నుంచి హైదరాబాద్‌కు సంగీతానికీ విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడి సంగీత ప్రియుల గురించి దేశవ్యాప్తంగా తెలుసు. 16 మంది ప్రముఖ సంగీత విద్వాంసులు, ఐదుగురు ప్రముఖ సింగర్లు.. మొత్తం నాతో పాటు 25 మంది భారీ బృందంతో ఈ ప్రతిష్టాత్మక కచేరీ హైదరాబాద్‌ నగరాన్ని సంగీత సాగరంలో ముంచెత్తనుంది.  
– సింగర్‌ అమేయ డబ్లి  

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)