Breaking News

అంబానీ కుటుంబం ఆ ఆవు పాలనే తాగుతారట..లీటర్‌ ఏకంగా..!

Published on Wed, 06/12/2024 - 13:54

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా అది వైరల్‌ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా వారు ఉపయోగించే కార్ల దగ్గర నుంచి వాచ్‌ల వరకు ప్రతీదీ హాట్‌టాపిక్‌గా ఉంటుంది. ఎందుకంటే వాటి ధరలన్ని కోట్లలోనే. అలానే ప్రస్తుతం అంబానీ కుటుంబం తాగే పాల గురించి ఓ టాపిక్‌ నెట్టింట తెగ వైరల్‌గా అవుతోంది. వాళ్లు తాగే అదే పాలను కొందరూ ప్రముఖులు, సెలబ్రెటీలు కూడా తాగుతారట. మరీ అవి ఏ పాలు, వాటి ప్రత్యకతలేంటో చూద్దామా..!

సాధారణంగానే ముఖేష్‌ అంబానీతో పాటు ఆయన భార్య, పిల్లలు కూడా తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రోటీన్స్‌, పోషకాలు సమృద్ధిగా ఉండేలా.. డైటీషియన్‌ చెప్పిన దాని ప్రకారం సమతుల్య ఆహారం తీసుకుంటారు. అలానే వారు తాగే పాలు కూడా చాలా ప్రత్యేకమేనట. వారు తాగే పాలు పూణే నుంచి వస్తాయట. నెదర్లాండ్స్‌కు చెందిన హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు జాతి పాలను తాగుతారట. ఈ జాతికి చెందిన ఆవులను పూణేలోని భాగ్యలక్ష్మి డెయిరీలో పెంచుతారు. 

ఈ డెయిరీ ఏకంగా 35 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు మూడు వేలకు పైగా ఈ జాతి ఆవులు ఉంటాయని చెబుతున్నారు. ఈ జాతి ఆవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పాడి పరిశ్రమలోని ప్రధానమైన జాతి. వీటిని అత్యధిక పాలను ఉత్పత్తి చేసే జాతిగా పిలుస్తారు. ఈ పాలల్లో ప్రోటీన్లు, స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. 

అంతేగాదు ఈ ఆవుల సంరక్షణ కోసం కేరళ నుంచి వచ్చే ప్రత్యేక రబ్బరు పూతతో కూడిన దుప్పట్లు ఉపయోగిస్తారట. ఇవి మాములు వాటర్‌ తాగవు..ఆర్ఓ వాటర్‌ని మాత్రమే తాగుతాయట. ఇవి చూడటానికి నలుపు తెలుపు లేదా ఎరుపు తెలుపు రంగుల్లో ఉంటాయట. సాధారణంగా హోల్‌స్టెయిన్ ఆవు సాధారణంగా 680 నుంచి 770 కిలోల బరువు ఉంటుంది. రోజుకు దాదాపు 25 లీటర్లకు పైగా పాలు ఇస్తాయట. ఈ పాల ధర ఏకంగా రూ. 152లు పైనే పలుకుతుందట.

ఈ పాలల్లో ఉండే పోషకాలు..
హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు పాలల్లో మామూలు ఆవు పాల కంటే ఎక్కువ మొత్తంలో పోషకాలుంటాయి అంటున్నారు నిపుణులు. వీటిలో ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ ఫ్యాట్స్, కార్బో హైడ్రేట్స్, విటమిన్ డి, A1, A2 బీటా-కేసిన్ (ప్రోటీన్) వంటివి పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే అవసరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా ఈ పాలల్లో ఉంటాయట. 

(చదవండి: మిస్‌ అలబామాగా ప్లస్‌ సైజ్‌ మోడల్‌..!)
 

 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)