Breaking News

రోజంతా నీరసంగా అనిపిస్తోందా? ఇలా ప్లాన్‌ చేయండి!

Published on Sat, 04/19/2025 - 12:34

చాలామంది రోజంతా నీరసంగా.. నిస్సత్తువగా గడుపుతుంటారు. దీనివల్ల శరీరం నిస్తేజంగా మారడమే కాకుండా అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చిన్నపాటి మార్పుల ద్వారా రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండవచ్చు. అవేంటో చూద్దాం.. 

తగినంత నిద్ర.. ప్రతిరోజూ కనీసం 7–8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్రలేమి చిరాకు, నీరసానికి దారితీస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం.. పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు,  ప్రొటీన్లు శరీరానికి శక్తినిస్తాయి. ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే వాటిని తగ్గించడం మంచిది. 

వ్యాయామం.. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల ΄ాటు వ్యాయామం చేయడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. శక్తి స్థాయులు పెరుగుతాయి. నడవడం, యోగా, డ్యాన్స్‌ లేదా ఇష్టమైన ఏదైనా శారీరక శ్రమ చేయవచ్చు.
నీరు తాగడం.. రోజంతా తగినంత నీరు తాగడం చాలా అవసరం. డీహైడ్రేషన్‌ వల్ల అలసట, చిరాకు కలగవచ్చు.
ధ్యానం, విశ్రాంతి.. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం లేదా రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ కోసం కేటాయించండి. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.

పాజిటివ్‌ ఆలోచనలు.. ప్రతికూల ఆలోచనలను తగ్గించుకుని సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండి. కృతజ్ఞత కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం.

ఇష్టమైన పనులు చేయడం.. ఆనందం కలిగించే హాబీలు లేదా పనుల కోసం సమయం కేటాయించడం మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

సామాజిక సంబంధాలు.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, ఇతరులతో మాట్లాడటం, కనెక్ట్‌ అవ్వడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

కొత్త విషయాలు నేర్చుకోవడం.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం లేదా కొత్త విషయాలు తెలుసుకోవడం మీ మనస్సును ఉత్తేజపరుస్తుంది, ఉల్లాసంగా ఉంచుతుంది.

రోజువారీ అలవాట్లు.. ఉదయం లేవగానే సహజమైన సూర్యకాంతిలో గడపడం  శరీరపు జీవ గడియారాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది, ఉల్లాసంగా ఉంచుతుంది.

చిన్న చిన్న విరామాలు.. మీరు ఎక్కువసేపు ఒకే పనిలో ఉంటే, మధ్యలో చిన్న విరామాలు తీసుకోండి. లేచి కొంచెం నడవండి లేదా స్ట్రెచ్‌ చేయండి.

పనులు ప్లాన్‌ చేసుకోవడం.. రోజువారీ పనులను ఒక క్రమంలో ప్లాన్‌ చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మరింత నియంత్రణలో ఉన్నట్లు అనిపిస్తుంది.

నవ్వండి, నవ్వించండి.. నవ్వడం ఒక గొప్ప ఒత్తిడి నివారిణి, హాయిగా నవ్వుకోడం మానసిక స్థితిని తక్షణం మెరుగు పరుస్తుంది.

ఈ చిట్కాలను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా రోజంతా ఉల్లాసంగాఉత్సాహంగా ఉండగలగడం ఎవరికైనా సాధ్యమే.ఒకవేళ మీకు ఏవైనా ప్రత్యేకమైన ఆందోళనలు ఉంటే, వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)