Breaking News

రాగిజావ రోజూ తాగుతున్నారా? ఇవి తెలుసుకోండి!

Published on Fri, 09/20/2024 - 16:49

ఇటీవలి కాలంలో ఆహారం, ఆరోగ్యంపై  అందరికీ శ్రద్ధ  పెరుగుతోంది. ఈ క్రమంలో ఆర్గానిక్‌ ఫుడ్‌, మిలెట్స్‌పై మరింత ఆసక్తి చూపిస్తున్నారు జనం.  అలాంటి వాటిల్లో ఒకటి రాగులు లేదా ఫింగర్‌ మిల్లెట్స్‌.   దీనిలోని ప్రయోజనాల కారణంగా మరింత ప్రజాదరణ పొందాయి. చవకగా దొరుకుతాయి కూడా. రాగుల జావ లేదా మాల్ట్‌ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం!

జీర్ణశక్తిని పెంచుకోవాలనుకున్నా, మధుమేహాన్ని తట్టుకోవాలనుకున్నా, లేదా మీ ఆహారాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోవాలనుకున్నా, అవసరమైన అన్ని పోషకాలతో నిండిన  సూపర్‌ఫుడ్‌ రాగుల పిండితో చేసుకొనే జావ.

రాగుల లడ్డు, రాగుల పిండితో మురుకులు ఇలా  రాగులతో  తయారు  చేసే  పదార్థాల్లో రాగిజావ,  రాగి ముద్ద బాగా పాపులర్‌. రాగి జావ తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలనుంచి విముక్తి లభిస్తుంది. సీ, ఈ విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్‌లు, కొవ్వులు, ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తాయి.  బి కాంప్లెక్స్, థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి.

రాగి జావతో ఆరోగ్య ప్రయోజనాలు

  • జీర్ణక్రియకు మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. రాగిజావలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతినిస్తుంది. ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి.

  • మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. రాగి జావలో పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్‌,మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రిస్తాయి.  గుండె కండరాల పనితీరు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

  •  రాగి జావ సహజ ఇనుముకు గొప్ప మూలం. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.

  • ఎముకలు బలోపేతం: రాగుల్లో కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది.

  • అధిక బరువుకు చెక్‌ చెబుతుంది. కాలేయ వ్యాధులను తగ్గిస్తుంది.
     

రాగి జావ తయారీ
రాగులను శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని పొడి చేసుకోవాలి.  మరుగుతున్న  ఒక గ్లాసు నీళ్లలో, ఒక  టీ స్పూన్‌ రాగుల పిండి వేసి, కలుపుతూ ఉడికించుకోవాలి. దీనికి మజ్జగ, ఉప్పు కలుపుకొని తాగవచ్చు. లేదా పచ్చిమిర్చి ఉల్లిపాయల ముక్కలతో కలిపి తాగవచ్చు. బెల్లం, నెయ్యి వేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు. రాగులను మొలకలు వచ్చేలా చేసి, వాటిని ఎండబెట్టి,  పొడి చేసుకొని కూడా జావ చేసుకోవచ్చు.  ఈ పొడిని తడిలేని గాజు సీసాలో భద్రం చేసుకోవచ్చు.

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)