Breaking News

పరగడుపునే ఆ నీళ్లు తాగితే..బరువు తగ్గడం ఖాయం!

Published on Wed, 08/16/2023 - 11:21

ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదని అందరికీ తెలిసిందే. పైగా మలబద్దకం ఉండదని తేలిగ్గా ఆహారం జీర్ణం అవుతుందని ఉదయాన్నే గోరువెచ్చగానో లేదా చల్లగానో నీళ్లు తాగుతున్నారు. ఐతే ఆ నీళ్లనే ఔషధ గుణం గల నీళ్లుగా తయారు చేసుకుని తాగితే అధిక బరువు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఆ ఔషధం గుణాలు గల నీళ్లు అంటే ఏమిటి? ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం!.

ఎలా ఔషధ గుణాలు గల నీళ్లుగా మార్చాలి? 

  • తెల్లవారుజామునే గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. ఇది అద్భుత ఔషధ గుణాలను అందిస్తుంది. పాన్‌లో ఒక గ్లాసు నీటిని పోసి వేడి చేసి దానికి ఒక అంగుళం బెల్లం వేసి కరిగాక చల్లార్చి వకట్టి త్రాగాలి. లేదా బెల్లం ముక్క ప్లేస్‌లో బెల్ల పొడిని కూడా ఉపయోగించొచ్చు. ఇలా నీళ్లను ఔషధ గణాల గల నీరుగా మార్చుకుని తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది. 
  • బెల్లం జీవక్రియలను పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతున్నవారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. షుగర్‌ వల్ల బరువు పెరిగితే బెల్లం తినడం వల్ల బరువు అదుపులో ఉండి శరీరం ఫిట్‌గా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
  • అలాగే బెల్లంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. బెల్లం కండరాల బలానికి ఉపయోగపడుతుంది. 

మనం నిత్య జీవితంలో వినియోగించే బెల్లంతో కలిగే అద్భుత ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌ రీత్యా అంతా షుగర్‌నే ఎక్కువగా వాడేస్తున్నారు. అదీకాగా షుగర్‌ అయితే ఈజీగా నీటిలో కరిగిపోతుంది. దీంతో అందరూ దాన్నే ఉపయోగిస్తున్నారు. నిజానికి బెల్లం వల్లే కలిగే ప్రయోజనాలు ఏమీ చక్కెరలో ఉండవు. బెల్లంలో ఉండే పోషక ప్రయోజనాలతో మరొకటి పోటీపడలేదంటే అతిశయోక్తి కాదేమో!. బెల్లంలోని అనేక పోషకాలు ఆరోగ్యానికి అద్భుతంగా మేలు చేస్తాయి. బెల్లం తినడం వల్ల అనేక వ్యాధులు బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో కాల్షియం, జింక్‌, ఫాస్పరస్‌, కాపర్‌ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. 

(చదవండి: తుమ్ము వస్తే.. ఆపుకుంటున్నారా!ఇక అంతే సంగతులు)

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)