Breaking News

రోజూ చప్పట్లు కొట్టడం వల్ల మెమొరి పవర్‌ పెరుగుతుందా?

Published on Sat, 11/25/2023 - 16:44

ఎవరైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు, వారు చేసిన పని హర్షణీయంగా... ప్రశంసార్హంగా అనిపించినప్పుడు వారిని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతాం.. అయితే అలా చప్పట్లు కొట్టడం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటికే ‘క్లాపింగ్‌ థెరపీ’ అని పేరు. చప్పట్లు కొట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చూద్దాం... 

►సాధారణంగా ఎవరినైనా అభినందిస్తున్నప్పుడు చప్పట్లు కొడతాం. అది ప్రశంసలో ఒక భాగం. కానీ చప్పట్లు కొట్టడం వెనుక చాలామందికి తెలియని ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ‘లాఫింగ్‌ థెరపీ’ మాదిరిగానే ‘క్లాపింగ్‌ థెరపీ’ కూడా ఇప్పుడు ఫేమస్‌ అయ్యింది. క్లాపింగ్‌ థెరపీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే..

►మనిషి శరీరంలో ప్రతి అవయవం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అరచేతులు రక్తనాళాలు, నరాల చివరలకు కేంద్రం. మీరు వాటిని ఉత్తేజపరిస్తే మీ ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. అయితే చప్పట్లు కొట్టడం వల్లే ఆరోగ్యం విషయంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

►చప్పట్లు కొట్టడం ఆందోళనను నియంత్రించడానికి సులభమైన మార్గం. చప్పట్లు కొట్టడం ప్రారంభించగానే మెదడుకి సానుకూల సంకేతాలు వెళ్తాయి. ఇది నిరాశను పోగొడుతుంది. సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి రోజువారి వ్యాయామంలో చప్పట్లు కొట్టడాన్ని కూడా భాగంగా చేసుకోవాలి.


►కరతాళ ధ్వనులు చేయడం వల్ల రక్తపోటు స్ధాయులు నియంత్రణలో ఉంటాయి. తద్వారా గుండె ఆరోగ్యం బాగుంటుంది. చప్పట్లు కొట్టినపుడు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అనేక గుండె సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు, చప్పట్లు కొట్టడంతో శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. 

►చప్పట్లు కొట్టడం వల్ల తెల్ల కణాల ఉత్పత్తి పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రుజువైంది. ఫలితంగా కాలానుగుణంగా వచ్చే అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. పిల్లలు క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవడంతో పాటు వారి చేతి రాతలో తప్పులు దొర్లకుండా ఉంటాయి. 

► చప్పట్లు కొట్టడం వల్ల జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను ఆశిస్తూ చప్పట్లు కొట్టే ముందు అరచేతులకు కొద్దిగా ఆవ నూనె లేదా కొబ్బరి నూనె రాసుకోవడం మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. అరచేతుల్ని నిటారుగా ఉంచి.. చేతివేళ్లు ఒకదానికొకటి తాకేలా ఉంచి చప్పట్లు కొట్టాలి. మంచి ఫలితాల కోసం ఉదయం పూట కొట్టడం మంచిదట. లేదంటే ఎవరి వీలును బట్టి వారు ఈ క్లాపింగ్‌ థెరపీ ని అనుసరించవచ్చు.
  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)