Breaking News

ఉంగరంతో ఆరోగ్యం పదిలం!

Published on Sun, 05/05/2024 - 16:04

ఉంగరం వేలు మన గుండె నరాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకనే మన పెద్దలు ఉంగరం వేలుకి ఉంగరం పెట్టేవారని మనం కథకథలుగా విన్నాం. అలాగే ఆయుర్వేదంలో కూడా వేళ్ల నరాలకు మన శరీరంలోని అవయవాలకు సంబంధం ఉందని చెబుతోంది. అయితే చైనా కంపెనీ ఆ ఉంగరంతోనే మన ఆరోగ్యం పదిలంగా ఉండేలా..సరికొత్త  స్మార్ట్‌ ఉంగరాన్ని తీసుకొచ్చింది.

శరీరం పనితీరును, ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించే స్మార్ట్‌వాచీలు, స్మార్ట్‌ రింగ్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వాటి కోవలోనిదే ఈ స్మార్ట్‌ రింగ్‌. చైనీస్‌ కంపెనీ ‘అమాజ్‌ఫిట్‌’ ఇటీవల ఈ స్మార్ట్‌రింగ్‌ను ‘హీలియో రింగ్‌’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. వ్యాయామం చేసేవారికి, క్రీడాకారులకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. 

ఇందులోని సెన్సర్లు ఎప్పటికప్పుడు శరీరం పనితీరును గమనిస్తూ స్మార్ట్‌వాచీ లేదా స్మార్ట్‌ఫోన్‌కు యాప్‌ ద్వారా సమాచారాన్ని చేరవేస్తాయి. రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయి, గుండె పనితీరు, ఊపిరితిత్తుల పనితీరు, ఒత్తిడి, నిద్ర తీరు సహా పలు అంశాలపై ఈ ఉంగరం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ ఉంగరాన్ని కొనుగోలు చేసేవారికి ‘అమాజ్‌ఫిట్‌’ మూడు నెలల వరకు ‘జెప్‌ ఆరా’ హెల్త్‌ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తుండటం విశేషం. ఈ స్మార్ట్‌రింగ్‌ ధర 71 డాలర్లు (రూ.5,914) మాత్రమే! 

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?)
 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)