Breaking News

అమర్‌నాథ్ యాత్రకు ప్లాన్‌ చేస్తున్నారా? వీటిని అస్సలు తీసుకెళ్లకూడదు!

Published on Mon, 04/14/2025 - 18:15

Amarnath Yatra  2025 ప్రముఖ ఆధ్మాత్మిక యాత్ర అనగానే ముందుగా గుర్తొచ్చేది అమర్‌నాథ్‌యాత్ర.  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమర్‌నాథ్‌ యాత్ర షెడ్యూల్‌ వచ్చేసింది. ప్రతి ఏడాది  నిర్వహించే ఈ యాత్ర   ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని రోజుల మాత్రమే  పరిమితం. బాబా బర్ఫానీ యాత్రగా  చెప్పుకునే ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర జూలై 25 నుండి ఆగస్టు 19 వరకు  వరకు సాగనుంది.  శివుడి ప్రతిరూపమైన మంచు లింగాన్ని చూడటానికి ప్రతిరోజూ 15వేల మంది యాత్రికులు  ఇక్కడికి తరలివస్తారు. ఈ యాత్రకు సంబంధించి ముందుగానే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలి. 2025 ప్రయాణానికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ  ఏప్రిల్‌ 14 నుంచి మొదలైనట్టు బోర్డు ప్రకటించింది.

జమ్మూ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహకు సాగే అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాలంటే కొన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా 13 ఏళ్ల కంటే తక్కువ 75 ఏళ్లు పైబడిన వృద్ధులు అనర్హులు. అంతేకాదు అమర్‌నాథ్‌కు వెళ్లే ముందు వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని సర్టిఫికేట్‌ కూడా ఉండాలి. ఒక్క పర్మిట్‌కు ఒక్క భక్తుడు మాత్రమే అర్హులు ఇతరులకు ట్రాన్స్‌ఫర్‌ చేసే అవకాశం ఉండదు అని గమనించాలి. అమర్‌ నాథ్‌ యాత్ర 40-60 రోజులు వాతావరణ పరిస్థితులను బట్టి నిర్వహిస్తారు. ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌   ఈ ఏడాది ఏప్రిల్‌ 14 తేదీ నుంచే ప్రారంభం అయింది. ఈ యాత్ర ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ మోడ్‌లలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో యాత్రబోర్డు భక్తులకు భద్రత, ఆహార సౌకర్యాలు కూడా కల్పిస్తుంది.

ఈ కష్టతరమైన ప్రయాణానికి జాగ్రత్తలు, తీసుకెళ్లకూడని ఆహారపదార్థాలు,  తీసుకెళ్ల కూడని వస్తువుల  జాబితాను  కూడా ప్రకటించారు. ఈ యాత్ర సమయంలో జంక్ ఫుడ్ యాత్రికులకు పెద్ద అడ్డంకిగా మారింది. చాలా మంది భక్తులు లంగర్ సేవలను ఎంచుకుంటారు. ఇక్కడ స్వచ్ఛంద సేవకులు, సంస్థలు మార్గంలో కమ్యూనిటీ కిచెన్‌లను నిర్వహిస్తాయి. భక్తుల సౌకర్యార్థం ఉచిత భోజనం, పానీయాలను అందిస్తాయి. వీటికితోడు స్థానిక వ్యాపారులు నడిపే స్థానిక తినుబండారాలు, రెస్టారెంట్లు , టీ స్టాళ్లు కూడా యాత్రికులకు ప్రాంతీయ వంటకాలు , రిఫ్రెష్‌మెంట్‌లు  ఉండనే ఉంటాయి.

నిషేధిత ఆహార పదార్థాలు
మాంసాహార ఆహారాలు: అన్ని రకాల మాంసం ఉత్పత్తులు
మత్తు పదార్థాలు: ఆల్కహాల్, పొగాకు, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు మరియు ఇతర మత్తు పదార్థాలు
వేయించిన ఆహారాలు: పూరీ, బతురా, పిజ్జా, బర్గర్, స్టఫ్డ్ పారంతా, దోస, వేయించిన రోటీ, వెన్నతో బ్రెడ్
క్రీమ్ ఆధారిత వంటకాలు: భారీ క్రీమ్‌తో తయారుచేసిన ఏదైనా ఆహారం
సంభారాలు: ఊరగాయ, చట్నీ, వేయించిన పాపడ్
ఫాస్ట్ ఫుడ్స్: చౌమీన్ , ఇతర సారూప్య తయారీలు, శీతల పానీయాలు
తీపి మిఠాయిలు: కర్రా హల్వా, జలేబీ, గులాబ్ జామున్, లడ్డు, ఖోయా బర్ఫీ, రసగుల్లా తదితర స్వీట్లు
కొవ్వు ,ఉప్పు అధికంగా ఉండే స్నాక్స్: చిప్స్, కుర్కురే, మత్తి, నమ్కీన్ మిశ్రమం, పకోరా, సమోసా, వేయించిన డ్రై ఫ్రూట్స్


అనుమతి ఉన్న ఆహార పదార్థాలు
స్టేపుల్స్: తృణధాన్యాలు, పప్పులు, బియ్యం
తాజా ఉత్పత్తులు: ఆకుపచ్చ కూరగాయలు, ఆకుపచ్చ సలాడ్, పండ్లు, మొలకలు
సహజ తీపి పదార్థాలు: బెల్లం లాంటివి,
దక్షిణ భారత వంటకాలు, సాంబార్, ఇడ్లీ, ఉత్తపం, పోహా
పానీయాలు: హెర్బల్ టీ, కాఫీ, తక్కువ కొవ్వు పెరుగు, షర్బత్, నిమ్మకాయ గుజ్జు/నీరు
ఎండిన పండ్లు: అంజీర్, ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు మరియు ఇతర వేయించని రకాలు
డెజర్ట్‌లు- స్వీట్లు: ఖీర్ (బియ్యం/సాబుదానా), తెల్ల ఓట్స్ (దలియా), తక్కువ కొవ్వు పాలు సావైన్, తేనె, ఉడికించిన స్వీట్లు (క్యాండీ)
తేలికపాటి స్నాక్స్: వేయించిన పాపడ్, ఖాక్రా,  నువ్వుల లడ్డు, ధోక్లా, చిక్కీ (గుచక్), రేవేరి
ఫులియన్ మఖానే, ముర్మారా, డ్రై పెథా, ఆమ్లా మురబా, ఫ్రూట్ మురబా, పచ్చి కొబ్బరి లాంటివి తీసుకెళ్ళొచ్చు. 
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)