Breaking News

అల్యూమినియం పాత్ర.. ‘అతి’ వాడకంతో ముప్పు!

Published on Mon, 06/30/2025 - 14:02

ఒకప్పుడు వంట చేయాలంటే మట్టి పాత్రలే వినియోగించేవాళ్లు. ఆ తర్వాత కాలక్రమేణా వంటింట్లోకి రాగి, ఇత్తడి, స్టీల్, అల్యూమినియం, నాన్‌స్టిక్‌ పాత్రలు చొచ్చుకొచ్చేశాయి. ప్రస్తుతం వీటిలో అత్యధిక మంది ఉపయోగించేవి అల్యూమినియం పాత్రలే. అన్నం, కూర, పిండివంటలు.. వంటకం ఏదైనా అల్యూమినియం గిన్నెలు ఉండాల్సిందే. ఈ పాత్రలు ఉపయోగించడం వరకు బాగానే ఉన్నా.. వాటిని సుదీర్ఘ కాలం వాడటం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వంట పాత్రలకూ ఎక్స్‌పెయిరీ ఉంటుందని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) వెల్లడించింది. 

రెండేళ్లకు మించి వాడొద్దు..
1938లో ఇండియన్‌ అల్యూమినియం కంపెనీ మన దేశంలో ఉత్పాదకత ప్రారంభించింది. అనంతరం అల్యూమినియం వంట పాత్రల తయారీ కుటీర పరిశ్రమగా మారింది. దేశంలో ఈ పాత్రలు లేని వంట గది ఉండదు. అందుబాటు ధరల్లో లభిస్తుండడంతో ప్రజలు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని సుదీర్ఘకాలం ఉపయోగించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

వీటి తయారీ నాణ్యతను బట్టి 12 నుంచి 24 నెలలకు ఒకసారి పాత్రలను మారుస్తుండాలని బీఐఎస్‌ సూచించింది. తేలికైన వంట పాత్రలను ఏడాదికి మించి వాడకూడదని తెలిపింది. సూపర్‌ గ్రేడ్‌ వంట సామగ్రి సైతం అధిక ఉష్ణోగ్రతల్లో వేడికి గురై నెలల వ్యవధిలోనే పాడై పోతుంటాయని పేర్కొంది. ఈ క్రమంలో వీటిని రెండేళ్లకు మించి వినియోగించకపోవడం ఉత్తమమని సూచించింది.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..
ఈ పాత్రల్లో టమాటా, చింతపండు, నిమ్మకాయ వంటి పుల్లటి పదార్థాలతో వంటలు చేయడం వల్ల అల్యూమినియం కరిగి ఆహారంలోకి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారం శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఎముకలు, మెదడు సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీజబ్బుతో బాధపడేవారికి మరింత ఎక్కువ హాని చేసే అవకాశం ఉందని వివరించారు.

త్వరలో కొత్త నిబంధనలు అమల్లోకి..
అల్యూమినియం వంట పాత్రల తయారీ ప్రమాణాలను బీఐఎస్‌ సవరించింది. వంట పాత్రల తయారీలో సీసం, కాడ్మియం, పాదరసం, హెక్సావాలెంట్‌ క్రోమియం వంటివి 0.05 శాతం కంటే తక్కువ ఉండాలని స్పష్టం చేసింది. వచ్చే నెల నుంచి దేశంలోని చిన్న పరిశ్రమలు, అక్టోబర్‌ నుంచి సూక్ష్మ పరిశ్రమల్లో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అలాగే వంట పాత్రలపై అల్యూమినియం గ్రేడ్‌ను లేబులింగ్‌ చేయడం తప్పనిసరి చేసింది.

(చదవండి: డయాబెటిస్‌ని జయించిన జర్నలిస్ట్‌ స్టోరీ..! ఐసీయూలో ఉండాల్సిన స్టేజ్‌ నుంచి..)

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)