Breaking News

శిఖరాగ్రాన విడాకులు...

Published on Thu, 03/12/2026 - 03:02

‘ఆల్పైన్‌ డివోర్స్‌’... ప్రస్తుతం ఈ పదం ట్రెండ్‌ అవుతోంది. భార్యాభర్తలు విడిపోయే ఒక విచిత్ర పద్ధతి ఇది. నేటి యువత పెళ్లిలోగాని, ప్రేమలో గాని బ్రేకప్‌కు ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. తమ బ్రేకప్‌లో ప్రకృతిని  భాగం చేస్తున్నారు. దూరంగా ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ తమ భాగస్వామికి విడాకులు ఇస్తున్నారు.

ఆల్పైన్‌ డివోర్స్‌... ఎలా పుట్టింది? 
జీవిత భాగస్వామితో కలిసి దూరంగా అడవికో, పర్వతాల వైపుకో వెళ్తారు. అక్కడ ఆనందంగా గడుపుతున్న సమయంలో ’నీతో ఇక నేను కలిసి ఉండలేను’ అని చెప్పి వచ్చేస్తారు. ఇదే ‘ఆల్పైన్‌ డివోర్స్‌’. భాగస్వామిని దూరంగా తీసుకెళ్లి, అక్కడ వదిలేసి రావడం ఇందులో కీలకమైన విషయం. రాబర్ట్‌ బార్‌ రాసిన ‘యాన్‌ ఆల్ఫైన్‌ డివోర్స్‌’  కథతో ఈ పదం ట్రెండ్‌ అయ్యింది. ఓ భర్త తన భార్యను పర్వతం అంచుల్లోకి తీసుకెళ్లి, అక్కడినుంచి తోసేసి చంపాలనుకోవడం ఇందులో కథాంశం. టిక్‌టాక్‌ ద్వారా ఈ పదంపాపులర్‌ అయ్యింది.

కారణాలేంటి?
ఆల్పైన్‌ డివోర్స్‌కు కారణాలేంటి? అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనేది మానసిక విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. తమ భాగస్వామి తమను మోసం చేస్తున్నారన్న అనుమానం ఉన్నవారు, ఎలాగైనా తనను వదిలేసుకోవాలని భావించేవారు ఇటువంటి డివోర్స్‌కుపాల్పడుతున్నారని, కొందరి మానసిక ఆందోళన కూడా కారణమని అంటున్నారు. 

దంపతుల మధ్య అన్యోన్యత దూరమవడం ఈ ఆల్పైన్‌ డివోర్స్‌ను ప్రోత్సహిస్తోందని నిపుణులు అంటున్నారు. ఒకరి అవసరాలు మరొకరు గుర్తించకపోవడం, ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోవడం, నమ్మకం లేకపోవడం వంటివి పెరిగినప్పుడు, ఆ బంధం హింసకు దారితీయకుండా ఆల్పైన్‌ డివర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ బంధంలో ఉండిపోకుండా దూరమవుతున్నారు.

దూరం కావాలనుకుంటే ఇలాగా? 
భార్యాభర్తలు విడిపోవాలనుకోవడం సహజమే, కానీ దీనికోసం ఇలాంటి విధానం వాడుకోవడం మంచిదేనా అని చర్చ జరుగుతోంది. దూరంగా తీసుకెళ్లి అక్కడ వదిలేయడం వల్ల మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని, భద్రత అంశాలపై ఆందోళన తప్పదని అంటున్నారు. ఇలా ప్రవర్తిస్తున్నవారి మానసిక ఆరోగ్యానికీ చికిత్స అవసరం అంటున్నారు. విడాకులను చట్టబద్ధంగా ΄÷ందడమే మేలని, ఇలా అసంబద్ధంగా ΄÷ందడం సరికాదని వివరిస్తున్నారు. 

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)