Breaking News

తిరిగొచ్చిన ఉంగరం! ఆరు దశాబ్దాలు జ్ఞాపకం..

Published on Sun, 10/26/2025 - 11:28

నీదైతే ఎక్కడికెళ్లినా నీ దగ్గరకు వస్తుంది. నీది కాకపోతే ప్రపంచం మొత్తం వెతికినా తిరిగి రాదు.’ అన్నట్లు.. అచ్చం ఒక ఉంగరానికి జరిగింది. 1969లో న్యూయార్క్‌లోని సీడార్‌ బీచ్‌లో అల్ఫ్రెడ్‌ డి స్టెఫానో అనే వ్యక్తి ఒక రోజు  ఈత కొడుతున్నప్పుడు, అతని విలువైన క్లాస్‌ రింగ్‌ జారి నీటిలో పడిపోయింది.  

సముద్రంలో పడ్డ ఆ ఉంగరం, ఇక ఎప్పటికీ దొరకదని భావించి, దానికి మనసులోనే ఫుల్‌స్టాప్‌ పెట్టేసుకున్నాడు. కాని, కాలం మరో అద్భుతాన్ని దాచిపెట్టింది. దాదాపు 56 ఏళ్ల తర్వాత, డేవిడ్‌ ఓర్లొవ్‌స్కీ అనే మరో వ్యక్తి, మెటల్‌ డిటెక్టర్‌ పట్టుకుని బీచ్‌లో నిధి నిక్షేపాల కోసం వెతుకుతుండగా, అనుకోకుండా ఆ ఉంగరం అతని చేతికి చిక్కింది. 

మొదట అది సాధారణ ఆభరణమేమోనని అనుకున్నాడు. కాని, దానిపై చెక్కి ఉన్న పేరు, కాలేజీ గుర్తు చూసి ఆశ్చర్యపోయాడు. అదే సమయానికి, అతని భార్య ‘నువ్వు నీ ఉంగరం కోల్పోతే, దొరికిన వారు తిరిగి ఇస్తే ఎంత ఆనందిస్తావు?’ అని ప్రశ్నించింది. భార్య మాటలు అతన్ని కదిలించాయి. వెంటనే, ఉంగరం అసలు యజమాని కోసం వెతకడం ప్రారంభించాడు. 

అలా సోషల్‌ మీడియా సహాయంతో ఫేస్‌బుక్‌లో గాలించి, చివరికి డి స్టెఫానోకు ఆ ఉంగరం చేరేలా చేశాడు. దాదాపు ఆరు దశాబ్దాలుగా దాచుకున్న జ్ఞాపకం అకస్మాత్తుగా తిరిగి చేతిలోకి రావడంతో అతని కళ్లలో ఆనందబాష్పాలు వెల్లువెత్తాయి. 

(చదవండి: నీటికి బదులు బీర్‌! స్పెషల్‌ హైడ్రేషన్‌ స్టయిల్‌..)
 

 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)