Breaking News

కలల ఇంట్లోకి రాకముందే..అందని తీరాలకు!

Published on Sat, 06/14/2025 - 10:15

Air India plane crash అహ్మదాబాద్‌ ప్లేన్‌ క్రాష్‌లో తమ ప్రియమైన స్నేహితురాలు రంజిత గోపకుమార్‌ చనిపోయిందనే వార్త తెలిసి పుల్లాడ్‌ (కేరళ)లోని శ్రీ వివేకానంద హైస్కూల్‌ విద్యార్థులు షాక్‌ అయ్యారు.‘ఇది నిజమేనా!’ అని ఒకరికి ఒకరు ఫోన్‌ చేసుకున్నారు.పాత ఫోటోలలో రంజితను చూస్తూ భోరున విలపించారు.

రంజిత నర్స్‌గా పనిచేసేది.
‘రంజిత ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉండేది. అందరినీ నవ్వించేది. ఎన్నో కబుర్లు చెప్పేది. రంజిత నాకు మంచి స్నేహితురాలు. ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి’ అంటోంది జీజా దేవి. ఆమె రంజితకు పదవతరగతిలో క్లాస్‌మేట్‌.తురుతికాడ్‌లో ఇద్దరూ బీఎస్సీ కలిసి చదువుకున్నారు.డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో బీఎస్సీ నర్సింగ్‌లో చేరింది రంజిత.‘రంజితది ఒకరి మీద ఆధారపడే స్వభావం కాదు. స్వతంత్ర వ్యక్తిత్వం. ఓపెన్‌గా ఉండేది. ఆమె చనిపోయిందనే వార్త ఒక పట్టాన నమ్మలేకపోయాను’ అంటోంది దేవి. రంజితకు ‘సొంత ఇల్లు’ కల ఉండేది.

‘ఇల్లు కట్టుకోవాలనేది రంజిత కల. అందుకోసమే యూకేలో ఉద్యోగం చేయాలనుకుంది. కొత్త ఇంటి నిర్మాణం పుల్లాడ్‌లో జరుగుతోంది. తన కలల ఇంట్లోకి అడుగుపెట్టక ముందే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది’ అని బాధపడ్డారు రంజిత  పొరుగింటి వ్యక్తి అనిల్‌ కుమార్‌.

ఇదీ చదవండి:  Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)