Breaking News

Plane Crash: పాపం బాధితులు ఆ ఫోబియాతో..!

Published on Sun, 06/15/2025 - 17:49

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అందులో ప్రయాణించే ప్రయాణికులే గాక, ఆ ఘటనలో మెడికల్‌ కాలేజ్‌ విద్యార్థులు, పక్కనే ఉన్న టీ స్టాల్‌లో పనిచేసే వ్యక్తుల తోసహా అందరూ ఈ ప్రమాదంలో మృతి చెందారు. అంతా క్షణాల్లో బూడిదైపోయారు. ఈ ప్రమాద ఘటన యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురయ్యేలా చేసింది. అయితే ఇలాంటి ఘెర విమాన ప్రమాదం బారినపడి ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయులెందరో ఉన్నారు. కానీ వారంతా మానసికంగా కోలుకోవడం అంత ఈజీ కాదట. చావుని చాలా దగ్గరగా చూసి రావడంతో విమానం అన్న, ఆ శబ్దం విన్నా..హడిలిపోతారని చెబుతున్నారు నిపుణులు.

చాలామటుకు ఆయా బాధితులు ఏవియోఫోబియా లేదా ఏరోఫోబియాతో బాధపడుతుంటారట. మళ్లీ విమానం ఎక్కే సాహసం చేయరట. ఎంత కష్టమైన కార్లు, లేదా రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తారట. కొందరైతే ప్రయాణాలే చేయరట. ఇలానే ఓ మహిళ 2010లో ఓ విమాన ప్రమాదం బారినపడి తండ్రిని కోల్పోయింది. దాంతో ఆమె దాదాపు 10 ఏళ్ల వరకు విమానంలో ప్రయాణమే చేయలేదట. మరి ఇంతలా భయబ్రాంతులకు గురిచేసే ఆ విమాన ప్రమాద భయాన్ని ఎలా అధిగమించి ఇదివరకటిలో హాయిగా జీవించాలంటే..కొన్ని మానసిక ఆరోగ్య చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో సవివరంగా చూద్దామా..!.

విమాన ప్రమాదం బారినపడిన బాధితులు విమాన ప్రయాణం అనే పదం ప్రస్తావిస్తేనే భయాందోళనకు గురై వణికిపోతుంటారట. విమానం చూడటం, సంబంధిత విమాన టికెట్‌ అన్న భయపడతారట. సాధారణంగా ఏ వ్యక్తి అయిన తీవ్రంగా ప్రభావితమవ్వడం, భయానికి గురవ్వడం జరుగుతంది. అయితే కొందరిలో ఆ భయం తీవ్ర రూపం దాల్చి ఏవియోఫోబియా లేదా ఏరోఫోబియా బారిన పడతారట.

అలాంటి వ్యక్తులకు మొదట ఆందోళనకు సంబంధించిన మందులు ఇచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చెబుతున్నారు నిపుణులు. ఆ తర్వాత విమాన ప్రయాణం భయంకరమైనది కాదు అని తెలసుకునేలా కుటుంబసభ్యుల మద్ధుతు తోపాటు కౌన్సిలర్ల సాయం తీసుకోవాలి. 

విమాన భయం అధిగమించేందుకు..
భయం పోయేలా  4-7-8 పద్ధతిలో శ్వాస వ్యాయామలు చేయిస్తారు. నాడీ వ్యవస్థ స్థిమిత్తంగా ఉండేలా చేసి, భయానికి సంబంధించిన ఆలోచనలు దరిచేరనివ్వకుండా చూస్తారు. విమనాలు, వాటికి సంబంధించిన ఆడియోలను వారితో షేర్‌ చేసుకుంటూ..ఎంత ఆహ్లాదంగా ఉంటుందో వివరించడం వంటివి చేస్తారు. తాను అనుభవించిన చేదు అనుభవాలు తాత్కలికమే విషయం గ్రహించేలా చేస్తారు. 

తరుచుగా ఆగి ఉన్నవిమానం వద్దకు తీసుకువెళ్లడం, అందులో కూర్చొనేలా చేసి..ఆయా బాధితుల్లో దాగున్న భయాన్ని పూర్తిగా పోగొడతారు. ఆ తర్వాత వర్చువల్ రియాలిటీ ఎక్స్‌పోజర్ థెరపీ (VRET)తో..విమానం ఎగిరే వివిధ దశలను (టేకాఫ్, టర్బులెన్స్ అండ్‌ ల్యాండింగ్) అనుభూతి చెందేలా వీఆర్‌ హెడ్‌సెట్‌ని ఉపయోగిస్తారు. ఆసమయంలో బాధితులు వ్యక్తికరించే వారి భావోద్వేగాలను గమనిస్తూ..కౌన్సిలర్‌ బాధితులకి ధైర్యాన్ని అందించేలా సహాయం చేస్తుంటాడు. 

అలా వాళ్లు నెమ్మదిగా ఆ భయాన్ని అధిగమించి తిరిగి విమాన ప్రయాణం చేయడానికి చాలా సమయమే పడుతుందని చెబుతున్నారు నిపుణులు.  ఆ భయం నుంచి బయటపడటానికి ఆయా వ్యక్తుల మానసికి పరిస్థితి ఆధారంగా..కనీసం ఆరు నుంచి పదేళ్లు పడుతుందని చెబుతున్నారు. దేన్నైనా లైట్‌గా తీసుకునేవారు..సానుకూల దృక్పథంతో ఉండేవారు సులభంగా ఈ విమాన ప్రమాద భయాన్ని జయించగలరని చెబతున్నారు నిపుణులు.

(చదవండి: అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్‌)

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)