Breaking News

పాతిక సంవత్సరాల తరువాత.... సొంత గొంతు!

Published on Sat, 09/06/2025 - 23:11

లండన్‌కు చెందిన ఆర్టిస్ట్‌ సారా పాతిక సంవత్సరాల క్రితం మోటర్‌ న్యూరాన్‌ డిసీజ్‌ (ఎంఎన్‌డీ) వల్ల మాట్లాడే శక్తిని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇతరులతో కమ్యూనికేషన్‌ కోసం వాయిస్‌ జనరేటింగ్‌ టెక్నాలీజిని ఉపయోగిస్తూ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ ను పునః్రపారంభించింది. ఈ టెక్నాలజీ ద్వారా వినిపించే గొంతు ఆమెది కాదు. దీనికి సంబంధించి ఆమె పిల్లల్లో చిన్న అసంతృప్తి ఉండేది. అమ్మ ఒరిజినల్‌ వాయిస్‌ వినాలనుకునేవారు. ఎందుకంటే వారు చిన్న వయసులో ఉన్నప్పుడే సారా మాట కోల్పోయింది. 

అమ్మ ఒరిజినల్‌ వాయిస్‌ వినడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక వ్యక్తి ఒరిజినల్‌ వాయిస్‌కు కంప్యూటరైజ్‌డ్‌ వెర్షన్‌ను క్రియేట్‌ చేయవచ్చు అని తెలుసుకున్నారు. దీనికి ఎక్కువ నిడివి, క్వాలిటీ రికార్డింగ్‌ ఉన్న వీడియో కావాలి.అయితే వారికి అమ్మ ఒరిజినల్‌ వాయిస్‌కు సంబం«ధించి ఒకే ఒక వీడియో క్లిప్‌ దొరికింది. అది కూడా తక్కువ నిడివి, శబ్ద నాణ్యత లేని వీడియో క్లిప్‌. ఈ నేపథ్యంలో సారా పిల్లలు న్యూయార్క్‌లోని ఏఐ వాయిస్‌కు ప్రసిద్ధి చెందిన ‘ఎలెవెన్‌ ల్యాబ్స్‌’ను సంప్రదించారు.

సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఏఐ ల్యాబ్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. సారా ఒరిజినల్‌ వాయిస్‌ను సృష్టించింది. ఆ వాయిస్‌ను పిల్లలు సారాకు వినిపించినప్పుడు ఆమె ఆనందం తట్టుకోలేక ఏడ్చింది. ‘నా గొంతు నాకు తిరిగి వచ్చింది’ అని ఆ వాయిస్‌ క్లిప్‌ను తన స్నేహితులకు పంపింది. ఇప్పుడు సారా తన లండన్‌ యాక్సెంట్‌తో, ఒరిజినల్‌ వాయిస్‌తోనే కమ్యూనికేట్‌ చేస్తోంది.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)