Breaking News

ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌: చచ్చిన ఎలుక ఎక్స్‌ట్రా, కట్‌ చేస్తే..!

Published on Wed, 01/17/2024 - 13:07

వండుకునే ఓపిక లేకనో, కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడో లేదా కొత్తగా తినాలనే ఆశతోనే రెస్టారెంట్లనుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకొని లాగించేస్తున్నారా?   అయితే ఇకపై ఇలా చేయాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిందే. అంతేకాదు మనం తినబోతున్న ఆహారం  శుభ్రంగానే ఉందా లేదా అనేది చెక్‌ చేసుకోకపోతే అంతే సంగతులు.  ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌  చేసేవారికి షాకిచ్చే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.  

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక వ్యక్తి ముంబై రెస్టారెంట్ నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు.  ఆర్డర్ చేసిన ఆహారాన్ని హ్యాపీగా ఆరంగించేశాడు. కానీ  ఆతరువాతే అసలు  తిప్పలు మొదలయ్యాయి.   ఫలితంగా ఒకటి రెండు కాదు 75 గంటల పాటు ఆసుపత్రి  పాలయ్యాడు.

రాజీవ్ శుక్లా  తన బాధాకరనమైన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీని ప్రకారం  జనవరి 8న   ముంబై వెళ్లాడు. ఫుడ్‌ చైన్ బార్బెక్యూ నేషన్‌కు చెందిన వర్లీ అవుట్‌లెట్ నుండి వెజ్ మీల్ ఆర్డర్ చేశాడు.  కొంత ఆహారం తిన్న తరువాత  అందులో  చనిపోయిన ఎలుకను  చూసి షాకయ్యాడు.  ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో  ఆసుపత్రిలో చేరి చికిత్స  తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఫుడ్‌ ఆర్డర్ రసీదు, డెలివరీ  ప్యాకేజీ,  ఫుడ్‌ ఫోటోతోపాటు  తను ఆసుపత్రిలో ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు. అలాగే తానింకా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కూడా ట్వీట్‌ చేశాడు. స్పష్టం చేశాడు.దీంతో ఇది నెట్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. తమ తమ అనుభవాలను పంచుకుంటూ ట్వీపుల్‌ స్పందించారు. 

బార్బెక్యూనేషన్, ఇతర అధికారుల హ్యాండిల్‌లను ట్యాగ్ చేశారు. దీంతో  జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ  బార్బెక్యూ నేషన్‌ స్పందించింది.  సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామంటూ రిప్లై ఇచ్చింది. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)