ఈతరం నేర్చుకోలేకపోతున్న లైఫ్‌ స్కిల్స్‌ ఇవే..!

Published on Tue, 05/27/2025 - 15:51

ప్రస్తుతం జనరేషన్‌ అంత ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్‌ల టెక్నాలజీ యుగంలో పెరుగుతోంది. అలా అని టెక్నాలజీ మీద మంచి పట్టు ఉంది అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే.. దానికంటే..కనీస ప్రాథమి జీవిత నైపుణ్యాలపై అవగాహన ఉండాలి. అత్యంత కీలకమైనది ఇదే అంటున్నారు నిపుణుల. మరీ ఈ తరం నేర్చుకోలేకపోతున్న ఆ జీవన నైపుణ్యాలేంటో తెలుసా..!.

టొరంటో మెట్రోపాలిటన్‌ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో చాలామంది యువకులకు కారు టైర్‌ మార్చడం, కుట్టడం వంటి చిన్న చిన్న పనులపై కనీస అవగాహన లేదంటున్నారు. చెప్పాలంటే ఈ జెన్‌ జెడ్‌ తరం అధికంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతోందని, ముఖ్యంగా ఊబకాయంతో బాధపడుతున్నారని పరిశోధనలో వెల్లడైంది. 

ఇంకొందరికి కనీసం చెల్లింపులు, డబ్బు ఖర్చు పెట్టే విషయం, వడ్డీరేట్లు గురించి అస్సలు సరిగా తెలియదని అన్నారు. ఇక్కడ పిల్లలు నేర్చుకుంటున్న చదువు వారి జీవన గమనానికి ఉపయోగపడకపోవటం బాధకరమని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత తప్పక నేర్పించాలని చెబుతున్నారు నిపుణులు. అలాగే తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడూ ఎలా ఇంటిని నిర్వహించాలి, ప్రమాదాలు వాటిల్లకుండా ఎలా వంట చేసుకోవాలి తదితరాలపై కొంచెం కూడా అవగాహన లేదని చెప్పారు. 

ముందు వాళ్లకు కనీస ప్రాథమిక జీవిత నైపుణ్యాలను నేర్పించాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇప్పటికే కొన్ని విద్యాసంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తూ..క్లాస్‌లో దీనిపై సెషన్లు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. ఇక మానసిక నిపుణులు ఆ నేపథ్యంలోనే 'అడల్టింగ్ 101' ఆన్‌లైన్‌ కోర్సు రూపొందించాయి. 

ఈ కోర్సులో ఏం నేర్చుకుంటారంటే..
పోషకాహారం అంటే ఏంటీ, గృహ నిర్వహణ, కిరాణ దుకాణానికి ఎలా వెళ్లాలి, ఎలా కొనుగోళ్లు చేయాలి వంటి అంశాలపై యువతకు తర్ఫీదు ఇస్తారు. నిజానికి ఈ తరం జనరేషన్‌ ఇవి తెలుసుకోకపోవడానికి ప్రధాన కారణం తగిన స్వేచ్ఛ లేకపోవడమేనని అంటున్నారు. 

అన్ని అమర్చిపెట్టేయడం, ఏదైనా చెయ్యబోతుంటే..అమ్మో..! వద్దు ఏదో అవుతుందంటూ పేరెంట్స్‌ అతి ప్రేమ ఒలకపోయడంతో ఈ జెన్‌ జెడ్‌ జీవిన విధానానికి సంబంధించిన పరిజ్ఞానం లేకుండా పోయిందని చెబుతున్నారు నిపుణులు. 1997  నుంచి 2012 మధ్య జన్మించిన యువతరానికి ప్రాథమిక జీవన నైపుణ్యాలు తెలియదని అన్నారు. ఇలా 'అడల్టింగ్ 101' క్రాష్ కోర్సుల సాయంతో వాళ్లు తెలుసుకునేలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు నిపుణులు.

(చదవండి: కల్చర్‌ మారింది సామీ..! అడవి బిడ్డల వివాహాల్లో 'పెళ్లి సందడి'..!)

 

 

#

Tags : 1

Videos

జగన్ రివర్స్ ఎటాక్.. చంద్రబాబుకు మరో దెబ్బ

కారులో నుండి రాకెట్ షాట్స్.. అప్పుడే న్యూయర్ రచ్చ షురూ జేసిండ్రు

పిల్లలను వెంటాడి చంపేస్తా..! తిరుమలలో సైకో హల్ చల్..

మాచర్లలో చీలిన టీడీపీ

అన్నంత పని చేసిన కిమ్.. షాక్ లో ప్రపంచ దేశాలు

అనంతలో గన్ కల్చర్

శ్రీశైలంలో ఘోరం.. 200 కేజీల మాంసం.. లిక్కర్ స్వాధీనం.. కార్లు సీజ్

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. క్రేజీ అప్డేట్!

నన్ను లక్షకు అమ్మేశాడు.. కాపాడండి సార్

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఏఎస్సై

Photos

+5

శివాజీ ‘దండోరా’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : గంగమ్మా..మమ్మేలు మాయమ్మా! (ఫొటోలు)

+5

'ఛాంపియన్' మూవీ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కాజల్ అగర్వాల్ డిసెంబరు జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

TTD: అదే నిర్లక్ష్యం.. భక్తుల భద్రత గాలికి.. (ఫొటోలు)

+5

ఈవినింగ్ చిల్ అయిపోతున్న సుప్రీత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ శివజ్యోతి మరోసారి బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

క్రిస్మస్‌ వేడుకల్లో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

ఈ ఏడాది మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన సమంత.. (ఫోటోలు)